సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ప్రారంభమైంది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలు, రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులపై ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా వలస కార్మికుల సామూహిక ప్రయాణాలు, తబ్లిగి జమాత్‌లో పాల్గొన్నవారికి కరోనా సోకడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ఇక లాక్‌డౌన్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచడం.. తదితర అంశాలు ఆ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment