గుంటూరు జిల్లాలోనే ఏపీ రాజధాని
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరు జిల్లాలోనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రపంచంలో్నే అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇంటికొక ఇటుకను సేకరిస్తామని తెలిపారు.
గుంటూరు జిల్లా శ్యావలాపురంలో బుధవారం జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ సమీపంలో ఉంటుందని ఇంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే. అయితే గుంటూరు జిల్లాలో ఉంటుందా? లేక కృష్ణా జిల్లాలోనా అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇందులో పలు ప్రాంతాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చంద్రబాబు తాజాగా గుంటూరు జిల్లాలోనే అని చెప్పడంతో సరికొత్త ఊహాగానాలకు తెరలేవనుంది.