ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ తొలి భేటీ గురువారం విశాఖలో ప్రారంభమైంది.
విశాఖ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ తొలి భేటీ గురువారం విశాఖలో ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్ ఈ మొదటి మంత్రివర్గ సమావేశానికి వేదిక అయ్యింది. చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రమాణస్వీకారోత్సవంలో చంద్రబాబు చేసిన ఐదు సంతకాలతో పాటు రాజధాని నిర్మాణంపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశాలున్నాయి. కేబినెట్ తొలి భేటీ సందర్భంగా భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా గురువారం ఉదయం విశాఖకు చేరుకున్న చంద్రబాబు నాయుడు ముందుగా సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన రాత్రి 7.30 గంటలకు విశాఖ నుంచి తిరిగి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారని సమాచారం.