ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విశాఖకు బయల్దేరారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విశాఖకు బయల్దేరారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో జరిగే సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ముందుగా ఆయన ప్రత్యేక విమానంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలిసి విశాఖ చేరుకుంటారు.
అక్కడ నుంచి జాతీయ రహదారి గుండా కైలాసగిరి చేరుకొని అక్కడ జిల్లా యంత్రాంగం అధికారికంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను గాలిపటాలు ఎగరేసి ప్రారంభిస్తారు. అక్కడ కొంతసేపు పండగ సంబరాల్లో అధికారులు, ప్రజలతో గడుపుతారు. అనంతరం నోవాటెల్లో పారిశ్రామికవేత్తలతో జరిగే సదస్సులో సింగపూర్ ప్రతినిధులతో కలిసి పాల్గొంటారు. ఆ తర్వాత 12 గంటలకు బయల్దేరి విజయవాడకు వెళ్తారు.