అంగన్‌వాడీ వర్కర్ల ఆందోళన
అంగన్‌వాడీ వర్కర్ల ఆందోళన
పత్తికొండ అర్బన్, : అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక దీక్షలు చేస్తున్న నాయకులను ప్రభుత్వం అరెస్టు చేయించడాన్ని నిరసిస్తూ వర్కర్లు, హెల్పర్లు ఆందోళన చేపట్టారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యదర్శి కాంతమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అరెస్టు చేయించడం దారుణమన్నారు. అంగన్‌వాడీ వ్యవస్థను ప్రైవేటు పరం చేయడాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు ఈనెల 17వతేదీ నుంచి అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీడీపీఓ వరలక్ష్మికి అందజేశారు. ఆటోవర్కర్స్ యూనియన్ నాయకుడు ప్రభాకర్, డీవైఎఫ్‌ఐ నాయకుడు బాలరాజు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఈశ్వరమ్మ, రమీజా, ఆశా, జయకుమారి, సరస్వతి, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.