
సాక్షి, విశాఖపట్నం: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త పాలక మండలిలో సభ్యురాలిగా తన నియామకంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో పాలకమండలి నుంచి తప్పుకుంటున్నట్టు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రకటించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. దీన్ని ఆదివారం తన నివాసం నుంచి ఫ్యాక్స్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment