దళితుడి పై దాడి కేసులో చింతమనేని అరెస్ట్‌ | Another Case Was Registered Against Chintamani Prabhakar | Sakshi
Sakshi News home page

దళితుడి పై దాడి కేసులో చింతమనేని అరెస్ట్‌

Published Mon, Oct 7 2019 3:25 PM | Last Updated on Mon, Oct 7 2019 3:25 PM

Another Case Was Registered Against Chintamani Prabhakar - Sakshi

పశ్చిమగోదావరి : దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు నమోదైంది. దళితుడి పై దాడి కేసులో రిమాండ్‌లో ఉండగానే పిటి వారెంట్‌ ఇచ్చి తిరిగి చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసుతో కలిపి మొత్తం ఐదు కేసుల్లో చింతమనేని అరెస్ట్‌ అయ్యారు. పెదవేగిలో మాజీ సర్పంచ్‌ మేడికొండ కృష్ణారావును కిడ్పాప్‌ చేసి దాడి చేసిన కేసులో, కోర్టు ఎదుట ఆయనను పోలీసులు హాజరుపరిచారు. 2018లో జరిగిన సంఘటనపై తాజాగా కోర్టు అతనికి ఈ నెల 9వరకు రిమాండ్‌ విధించింది. మాజీ సర్పంచ్‌పై దాడిచేసి కులంపై పేరుతో దూషించారని గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గత నెల 11వ తేదీ నుంచి 4 కేసులలో జిల్లా జైలులో టీడీపీ నేత చింతమనేని రిమాండ్‌లో ఉన్నారు. 

(చదవండి : చింతమనేనికి ఇక చింతే...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement