
తిరుమలలో మళ్లీ అపచారం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి వారం రోజుల్లో రెండు సార్లు విమానాలు రాకపోకలు సాగించాయి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి వారం రోజుల్లో రెండు సార్లు విమానాలు రాకపోకలు సాగించాయి. శనివారం కూడా ఆలయ ప్రధాన గోపురం పైనుంచి విమానం వెళ్లింది.
నో ఫ్లయింగ్ జోన్‌గా ఉన్న ప్రదేశంలో విమానాల రాకపోకలను నిషేధించినప్పటికీ ఇలా జరగడంపై వేదపండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఇది అపచారమని వారు వెల్లడించారు.