శ్రీవారి ఆలయంపై విమానం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ఆలయం పై విమానం ప్రయాణించింది. బుధవారం ఉదయం తిరుమల కొండపై వచ్చిన విమానం శ్రీవారి ఆలయం పై నుంచి వెళ్లింది. విమానం తిరుమలలో ఆలయం పై నుంచి వెళ్లడం కలకలం సృష్టిస్తోంది. ఆలయంపై విమానాలు వెళ్లడం ఆగమ విరుద్ధమని పండితులు చెబుతున్నారు. తిరుమల గర్భ ఆలయంపై విమానాలు ప్రయాణంపై నిషేదం ఉన్నా విమానయాన శాఖ పట్టించుకోవడంలేదని, ఇలా జరగడబ అరిష్టమంటున్నారు.
కాగా టీటీడీ ఛైర్మన్ చదలవాడి కృష్ణమూర్తి అప్పట్లో పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసి.. తిరుమల పుణ్యక్షేత్రాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరారు. తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించడం రక్షణ శాఖ పరిధిలో ఉందని, అయితే ఆలయంపై నుంచి విమానాలు వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించినట్టు కేంద్ర మంత్రి అశోకగజపతి రాజు ఇటీవలే చెప్పారు. కాగా, గడచిన పది రోజులలో ఆలయం మీదుగా విమానం వెళ్లడం ఇది రెండోసారి కావడం గమనార్హం.