హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారని చెబితే మరో ఉద్యమానికి దారితీసే అవకాశం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే విభజన జరుగుతుందని, ఎవరికీ ఏ వ్యక్తిగత అభిప్రాయాలున్నా కేంద్రాన్ని అధిగమించి ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇప్పటివరకు సామరస్యపూర్వక వాతావరణం ఉందని, ఎలాంటి కార్యక్రమాలైనా శాంతియుతంగా జరిగేలా చూసే బాధ్యత తమపై ఉందని జానారెడ్డి అన్నారు.
ఇక తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముస్లింలు కూడా హైదరాబాద్తో కూడిన తెలంగాణ కావాలనే కోరుకుంటున్నారని మాజీ మంత్రి
షబ్బీర్ అలీ చెప్పారు. తెలంగాణ ప్రాంతం 400 ఏళ్లుగా అభివృద్ధి చెందిందని, ఈ నగరాన్ని ఏ ఒక్కరూ అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు.
హైదరాబాద్ యూటీ అంటే మరో ఉద్యమం: జానారెడ్డి
Published Thu, Sep 5 2013 1:32 PM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement