అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో వ్యభిచార గృహాలపై జిల్లా పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఇద్దరు మహిళలతోపాటు నలుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసులు స్టేషన్కు తరలించారు.ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బుక్కరాయ సముద్రంలో ఇటీవల కాలంలో వ్యభిచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు.