
సాక్షి, అమరావతి : కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. పది లక్షల మందికి సగటున ఆంధ్రప్రదేశ్‌లో 830 మందికి పరీక్షలు నిర్వహించి దేశంలోనే తొలిస్థానంలో నిలవగా, 809 మందికి పరీక్షలు చేసి తర్వాతి స్థానంలో రాజస్థాన్ నిలిచింది.
ఇప్పటి వరకు 41,512 మందికి టెస్టులు చేశామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే 5,757 మందికి టెస్టులు నిర్వహించామని ప్రకటించింది. ఇందులో ట్రూనాట్ ద్వారా 3082 శాంపిళ్లను టెస్ట్ చేశామని వెల్లడించింది.