నైతికత పాటించడం ఆయా పార్టీల ఇష్టం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోవడంపై బీజేపీ స్పందించింది. రాజకీయాల్లో ఎలాంటి నైతిక విలువలు పాటించాలన్నది ఆయా రాజకీయ పార్టీల నిర్ణయాన్ని బట్టి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు వ్యాఖ్యానించారు. ఆదివారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలన్న దానిపై ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఉంటాయని, ఆయన అధికారాలపై బీజేపీ మాట్లాడదలచుకోలేదన్నారు.