హైదరాబాద్: రాష్ట్ర హోం శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోమవారం ఢిల్లీ వెళ్లారు.
ఆయన మంగళవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర పోలీసు విభాగానికి సంబంధించిన కీలక ప్రతిపాదనల ఆమోదం కోసం చినరాజప్ప ఈ పర్యటనలో ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.