
సాక్షి, కర్నూలు : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డా.ఆదిమూలపు సురేష్ సోమవారం జిల్లాకు వస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొదటిసారి జిల్లాకు వస్తున్నారు. కర్నూలు జొహరాపురం రోడ్డులోని జార్జ్ విద్యా సంస్థల చైర్‌పర్సన్ థెరిస్సామ్మ కుమారుడే ఈయన. అయితే మంత్రి ఎక్కడ పర్యటిస్తారన్న విషయంపై మాత్రం కచ్చితమైన సమాచారం లేదు. అయితే ప్రభుత్వ విద్యాసంస్థలను తనిఖీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి రోడ్డు మార్గాన ఉదయం 9 గంటలకు కర్నూలు చేరుకుంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 4 గంటలకు కర్నూలు నుంచి విజయవాడ బయలుదేరివెళ్తారు.