
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ఉదాసీనత వల్లే నేరాలు జరుగు తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అయితే గట్టిగా వ్యవహరిస్తే అవన్నీ తగ్గుతాయని చెప్పారు.
గురువారం రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో ఐదు ఎకరాల్లో రూ.254 కోట్లతో నిర్మించే ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్‌ఎస్‌ఎల్)కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉదాసీనంగా ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తాయన్నారు. ఏదో విధంగా కోర్టులో తప్పించుకోవచ్చనే ధీమాతో నేరాలు జరుగుతున్నాయని, గట్టిగా శిక్ష వేస్తే వీటికి అడ్డుకట్ట పడుతుందన్నారు.