
రేపటి నుంచి ఉద్యోగుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మంగళవారం (మే 19) నుంచి జూన్ 5వ తేదీ వరకు బదిలీలు ఉంటాయని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు.
కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా ఐదేళ్ల సర్వీసు ఉన్నవారిని బదిలీలు చేయాల్సిందిగా కోరామని ఆయన అన్నారు. కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు నిర్వహించాలని, బదిలీల విషయంలో పారదర్శకత పాటించాలని కోరినట్లు అశోక్ బాబు చెప్పారు.