సాక్షి, అమరావతి: కరోనా పరీక్షల కోసం నమూనాల సేకరణ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీఆర్డీఎల్ ల్యాబ్‌లు, ట్రూనాట్ ల్యాబ్‌ల్లో నమూనా సేకరణ కౌంటర్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ నమూనా సేకరణ కౌంటర్లు మూడు షిఫ్ట్‌లు పని చేసేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. (ఆ తర్వాతే ఏపీలోకి అనుమతి..)
ల్యాబ్‌ల్లో సేకరించిన నమూనా ఫలితాలు వచ్చిన వెంటనే కోవిడ్ పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు, కోవిడ్ ప్రొటోకాల్ అనుసరించి నమూనాలను జాగత్ర చేయాలని సూచించింది. ఐడీ నంబరు, సరైన మూత లేకుండా నమూనాల సేకరణ, బాక్సింగ్ లాంటి విధానాలు పాటించకుండా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. (ఏపీలో మరో 1908 కరోనా కేసులు..)
‘‘సదరు ఫలితాలను ఎంఎస్‌ఎస్ కోవిడ్ పోర్టల్ నమోదు చేయకుండా తిరస్కరించాలి. రెడ్ మార్కింగ్ చేసిన నమూనాలను ప్రాధాన్యతగా గుర్తించి తక్షణం ఫలితాలు ఇవ్వాలి. ఒకసారి కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మళ్లీ పాజిటివ్ వస్తే ఆ ఫలితాన్ని కొత్తదిగా ప్రకటించవద్దని’’ ఏపీ సర్కార్ సూచించింది. ఎంఎస్‌ఎస్ కోవిడ్ పోర్టల్, ఐసీఎంఆర్ పోర్టల్‌లో నమోదు చేసే ఫలితాలు ఆరు గంటలకన్నా ఆలస్యం అయ్యేందుకు వీల్లేదని వీఆర్డీఎల్ ల్యాబ్స్‌కు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment