సాక్షి, అమరావతి : ఏపీలో ఇప్పటివరకు 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. శనివారం రోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కరోనాపై విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఆయన వెల్లడించారు. ఈ రోజు 22 మందికి పరీక్షలు నిర్వహిస్తే అన్ని నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు 428 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఏపీలో విదేశాల నుండి వచ్చిన వారికి.. వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment