సాక్షి, అమరావతి: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వివిధ అంశాల్లో విజ్ఞాన మార్పిడి, శిక్షణ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో పలు జాతీయ సంస్థలతో ప్రభుత్వం సోమవారం అవగాహన ఒప్పందాలను చేసుకోనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయా సంస్థలతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకోనుంది. ఈ కార్యక్రమం మరికొద్ది సేపట్లో సీఎం క్యాంపు కార్యాలయంలో జరగనుంది.
చెన్నైలోని ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్‌తో పాటు.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్-న్యూఢిల్లీ, సాయిల్ సైన్స్ డివిజన్-న్యూఢిల్లీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్-హైదరాబాద్, సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్, శిక్షణ సంస్థ-ఫరీదాబాద్, నేషనల్ సీడ్ రీసెర్చ్, శిక్షణ సంస్థ-వారణాశి, సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్-హైదరాబాద్, నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్-కర్నాల్, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్-ఉత్తర్‌ప్రదేశ్, బెంగుళూరుకు చెందిన సదరన్ రీజనల్ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్, ఐసీఏఆర్ సీఐఎఫ్‌ఏ సంస్థలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment