సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విశాఖ పర్యటనలో భాగంగా కైలాసగిరి, సిటీ సెంట్రల్ పార్కులను సందర్శించారు. ఈ నేపథ్యంలో వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వర రావు గవర్నర్‌కు స్వాగతం పలికారు. గవర్నర్ వెంట ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా కూడా హాజరయ్యారు. తొలుత గవర్నర్ పర్యాటక కేంద్రం కైలాసగిరిలో పర్యటించారు. తరువాత తెలుగు మ్యూజియమ్‌ను సందర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశాఖ సుందరమైన ప్రదేశం.. తెలుగు మ్యూజియం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. తెలుగు అభివృద్ధి కోసం కృషి చేసిన సాహిత్య, రాజకీయ, ప్రముఖుల చిత్రాలు చూడటం ఆనందంగా ఉందన్నారు. రాజా నరసింగరావు, సర్వేపల్లి రాధకృష్ణన్ లాంటి మహోన్నత వ్యక్తులను స్మరించుకున్నానని తెలిపారు. మొదటి సారి 1977లో విశాఖలో జరిగిన కార్మిక సంఘాల సదస్సులో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. తర్వాత డా. వైఎస్ రాజశేఖరరెడ్డి సిటీ సెంట్రల్‌ను పార్క్‌ను సందర్శించారు. మ్యూజికల్ ఫౌంటెన్‌ను తిలకించి.. పార్కులో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment