కందుకూరి పురస్కారాలకు ఎంపికైంది వీరే | AP Govt announces Kandukuri Awards | Sakshi
Sakshi News home page

కందుకూరి పురస్కారాలకు ఎంపికైంది వీరే

Published Sun, Apr 16 2017 7:09 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

AP Govt announces Kandukuri Awards

అమరావతి: 2017వ సంవత్సరానికి ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి కందుకూరి రంగ స్థల పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో ముగ్గురిని, జిల్లాకు ఐదుగురు చొప్పున ప్రభుత్వం ఎంపిక చేసింది. కర్నాటి లక్ష్మీనరసయ్య, చింతా కబీర్ దాస్, అగ్గరపులు రజనీబాయి ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. మాగంటి మురళీమోహన్ అధ్యక్షతన కమిటీ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసింది.

రాష్ట్ర స్థాయి పురస్కార గ్రహీతలకు రూ.లక్ష, జిల్లా స్థాయి గ్రహీతలకు రూ.10వేలతో పాటు ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారు. ఈ పురస్కారాలను రాజమహేంద్రవరంలో ఈ నెల 30న ప్రదానం చేస్తారని ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ ఎండీ ఎస్.వెంకటేశ్వర్ వివరించారు. విజేతల పూర్తి వివరాల కోసం www.apsftvtdc.in వెబ్ సైట్లో ను సందర్శించాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement