హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 43మంది వైద్యులపై ప్రభుత్వం అభియోగాలు (ఆర్టికల్ ఆఫ్ చార్జెస్) నమోదు చేసింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో వివిధ జిల్లాలకు సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లు, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్‌లు, డిప్యూటీ సివిల్ సర్జన్‌లు ఉన్నారు. విధుల్లో సరైన ప్రవర్తన లేకపోవడం, విధులకు సరిగా రాకపోవడం తదితర కారణాలతో అభియోగాలు నమోదు చేసినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. 15 రోజుల్లోగా ప్రభుత్వానికి సంజాయిషీ ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. వైద్యులు ఇచ్చిన సంజాయిషీపై ప్రభుత్వం సంతృప్తి చెందితే అభియోగాలు ఉపసంహరణ చేసుకుంటుందని, లేదంటే అనంతరం విచారణకు ఆదేశిస్తామని తెలిపారు.
ప్రభుత్వ వైద్యులపై అభియోగాలు
Published Tue, Jun 7 2016 10:14 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
Advertisement
Advertisement