సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,505 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. వీటిలో 10,032 మందికి కరోనా నెగటివ్‌గా నిర్ధారణ కాగా.. 473 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంల్లో కరోనా నియంత్రణపై వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో 338 క్వారెంటైన్ కేంద్రాలలో 59, 686 బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5864 మంది క్వారెంటైన్ కేంద్రాల్లో ఉన్నట్లు తెలిపారు. (కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం)
అలాగే రాష్ట్రంలో కరోనా అనుమానితులను గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రెండుసార్లు ఫీవర్ సర్వే చేసినట్లు వెల్లడించారు. ఫేజ్ 1లో 1.35 కోట్లు, ఫేజ్ 2లో 1.40 కోట్లు కుటుంబాలను సర్వే చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 12 నుంచి రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, 1.47 కోట్ల కుటుంబాల్లో 1.45 కోట్ల కుటుంబాలకుపైగా సర్వే పూర్తి చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment