వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు | Application for admission to Vedic schools | Sakshi
Sakshi News home page

వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

Published Tue, Apr 26 2016 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

మే 31 వరకు గడువు
ఉచిత భోజన, వసతి సదుపాయాలు

 
 సాక్షి,తిరుమల: తెలుగు రాష్ట్రాల్లోని టీటీడీ వేదపాఠశాలల్లో 2016-2017 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  కీసరగుట్ట, చిలుకూరు, ఐ.భీమవరం, విజయనగరం, నల్గొండ, కోటప్పకొండలోని వేదపాఠశాల్లో ప్రవేశాలుంటాయి. నిర్దిష్ట వయసు, విద్యార్హతలు, పుట్టినతేదీ రుజువు చేసే ధ్రువపత్రాల నకళ్లు, సొంత చిరునామాతో కూడిన పోస్టుకార్డును జతచేసి మే 31వ తేదీలోపు పంపాలని టీటీడీ ప్రజా సంబంధాల విభాగం సోమవారం ఒక ప్రకటనలో కోరింది.

 ఋగ్వేదం-సకలశాఖ, శుక్లయజుర్వేదం-కాణ్వశాఖ, సామవేదం-రాణాయనీయశాఖ, కృష్ణ యజుర్వేదం-తైత్తిరీయశాఖ కోర్సుల కాలపరిమితి 12 సంవత్సరాలు. అధర్వణవేదం-శౌనకశాఖ కాలపరిమితి 7 సంవత్సరాలు. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు 5వ తరగతి ఉత్తీర్ణులై 2004, జూలై 1వ నుంచి 2006 జూన్ 30వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. ఇక అపస్తంబ పౌరహిత్యం (స్మార్తం), శైవాగమం, పాంచరాత్రాగమం, దివ్య ప్రబంధం కోర్సుల కాలపరిమితి 8 సంవత్సరాలు. ఈ కోర్సుల్లో చేరదలచుకున్న విద్యార్థులు 01-07-2002 నుండి 30-06-2004 మధ్య జన్మించి, ఏడో తరగతి విద్యార్హత కలిగి ఉండాలి.

 ఈ కోర్సుల్లో అధ్యయన కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తారు. ఒక్కొక్క వేద విద్యార్థికి రూ.3 లక్షలు,  ఒక్కొక్క ప్రబంధ, ఆగమ్మ, స్మార్త విద్యార్థికి రూ.లక్ష బ్యాంకులో డిపాజిట్ చేసి, కోర్సు పూర్తికాగానే వడ్డీతో కలిపి మొత్తం విద్యార్థికి చెల్లిస్తారు.  అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో రాత, మౌఖిక పరీక్షలకు హాజరుకావాలి. ఇతర వివరాలకు www.tirumala.org లేదా www.tirupati.org టీటీడీ వెబ్‌సైట్లకు సంప్రదించవచ్చు. విద్యార్థులు చేరదలచుకున్న వేద పాఠశాలను ముందుగా నిర్ధారించుకుని అక్కడికి మాత్రమే పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
 
 ఆయా వేదపాఠశాలల చిరునామాలు:

 కీసరగుట్ట: ప్రిన్సిపాల్, ఎస్‌వీ వేద సంస్కృత పాఠశాల,  కీసరగుట్ట, కీసర మండలం, రంగారెడ్డి జిల్లా-501301- సెల్ :8790720410

 ఐ.భీమవరం: ప్రిన్సిపాల్, ఎస్‌వీ వేదపాఠశాల,
     ఐ.భీమవరం, ఆకివీడు మండలం, పశ్చిమగోదావరి, 534235- సెల్: 9848355906.

 చిలుకూరు: ప్రిన్సిపాల్, ఎస్‌వీ వేదపాఠశాల, చిలుకూరు పోస్టు, మోయింబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా,501504, సెల్: 8790720410

 విజయగనరం: ప్రిన్సిపాల్, ఎస్‌వీ వేదశాల, శ్రీమత రామాయణ ప్రాంగణం, రామనారాయణ సారికా దగ్గర, విజయనగరం జిల్లా, 535004.
      సెల్:8790720460.

 నల్లగొండ: ప్రిన్సిపాల్, ఎస్‌వీ వేద పాఠశాల, ఎఎంఆర్‌ఎస్‌ఎల్‌బీసీ క్యాంపస్, పానగల్, రామగిరి,
     నల్లగొండ జిల్లా- 508002, సెల్: 9866862395

 కోటప్పకొండ: ప్రిన్సిపాల్, ఎస్‌వీ వేదపాఠశాల, కోటప్పకొండ, వయా సతుకూరు, గువయ్యపాళెం పోస్టు, గుంటూరు జిల్లా-522540, సెల్: 9000527367

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement