చిత్తూరు: ఓ ఆర్మీ ఉద్యోగి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని సొదం మండలంలోని బొరగబండ పంచాయతి పరిధిలోని మరవపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన బాలకృఫ్ఱ(25) సైన్యంలో పనిచేస్తూ సెలవులపై ఇంటికి వచ్చాడు. అయితే కుటుంబసభ్యులు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. దీంతో బాలకృష్ణ మంగళవారం రాత్రి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సబ్యులు వెతకగా ఓ బావి వద్ద విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు అంటున్నారు.