ఏపీ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్‌నే అడ్డంకి | ashok gajapathi raju blames congress | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్‌నే అడ్డంకి

Published Sat, Mar 7 2015 9:22 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ashok gajapathi raju blames congress

విజయనగరం(బొబ్బిలి): ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా దక్కకపోవడానికి కారణం కాంగ్రెస్‌నే కారణమని కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. ఆయన బొబ్బిలిలో శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదాను కాంగ్రెస్ కల్పించలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పిద్దామనుకున్నా కాంగ్రెస్ సీఎంలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. 14 వ ఆర్థిక సంఘం కూడా ప్రత్యేకు హోదా కుదరదని తేల్చిచెప్పిందన్నారు.

 

యూిపీఏ ప్రభుత్వం తెలంగాణకు మేలు చేకూరేలా విభజన చట్టం రూపొందించిందని ఆరోపించారు. విభజన బిల్లులో విశాఖ రైల్వే జోన్, పరిశ్రమలకు ప్రోత్సాహకాల విషయం ప్రస్తావించకపోవడంతో ప్రస్తుతం కేంద్రం నుంచి సహాయం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement