ఆ లాకర్లలో రూ.5 కోట్ల ఆస్తులు..! | Assets of Rs 5 crore in the locker ..! | Sakshi
Sakshi News home page

ఆ లాకర్లలో రూ.5 కోట్ల ఆస్తులు..!

Published Sat, Jun 11 2016 8:29 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

Assets of Rs 5 crore in the locker ..!

‘ఎర్ర’ క్వీన్ సంగీత చటర్జీ కేసు
కింది న్యాయస్థానం ఆదేశాలు రద్దు చేయండి
కోల్‌కతా హైకోర్టులో చిత్తూరు పోలీసుల పిటిషన్

చిత్తూరు: ఎర్రచందనం అంతర్జాతీయ మహిళా స్మగ్లర్, కోల్‌కతాకు చెందిన సంగీత చటర్జీ కేసును విచారి స్తున్న పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవా లు తెలుస్తున్నాయి. గురువారం సంగీత, ఆమె భర్త లక్ష్మన్‌కు చెందిన కోల్‌కతాలోని యూకో బ్యాంకు జోధ్‌పూర్ పార్కు బ్రాంచ్‌లో రెండు లాకర్లను అక్కడి పోలీసుల సమక్షంలో తెరచిన చిత్తూరు పోలీసులు సుమారు 2.50 కిలోల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వీటితో పాటు పలు ఆస్తులను, సంబంధించిన పత్రాలను సైతం సీజ్ చేశారు. చిత్తూరు పోలీసులు సీజ్ చేసిన ఆభరణాలు, ఆస్తుల పత్రాల విలువ రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చిత్తూరులో సంగీ తపై నమోదైన కేసుల్లో ఇక్కడి కోర్టుకు హాజరుకాకుండా సంగీత రెండుమార్లు కోల్‌కతా సిటీ కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంది.

తనకు ఆరోగ్యం బాగాలేదని అక్కడి కోర్టుకు చెప్పడంతో ఈనెల 20వ తేదీలోపు చిత్తూరు కోర్టుకు హాజరుకావాలని కోల్‌కతా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సంగీతను అరెస్టు  చేయడానికి అనుమతి ఇవ్వాలని, కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని చిత్తూరు పోలీసులు శుక్రవారం కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు తీర్పు తరువాత సంగీత విషయంలో ఎలా వ్యవహరించాలో తెలుస్తుందని చిత్తూరు పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement