సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రకృతి వైపరీత్యాలతో రైతన్నకు తీరని అన్యా యం జరుగుతోంది. రెండేళ్లుగా అకాల వర్షాలు, వడగండ్లతో పంటలకు నష్టం వాటిల్లుతోంది. రైతుల ఆరుగాలం శ్రమ వృథా అవుతోంది. జిల్లాలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో చేతికందిన పంట నీటి పాలవుతోంది. అనధికారి క లెక్కల ప్రకా రం జిల్లాలో 6,600 ఎకరా ల్లో వరి, మొక్కజొన్న, సోయాబిన్, పత్తి పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
తడిసి.. రంగుమారి..
వర్షాల వల్ల చేతికొచ్చిన పంట నీటి పాల య్యింది. పొలాల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలకొరి గాయి. వ్యవసాయ మార్కెట్లకు రైతులు తరలించిన వరి ధాన్యం, మొక్కజొన్న, సోయాబీన్ గింజలు కూడా రం గు మారాయి. వీటిని వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపంతో నష్టపోయామని, ప్రభుత్వమే రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
తగ్గుతున్న ధర
పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ధ్యాస సర్కారుకు లేకుండాపోయిందని రైతులు ఆరోపిస్తున్నా రు. పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించటానికి ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటి వరకు రంగప్రవేశం చేయకపోవడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. మార్కెట్లలో సరైన వసతులు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఇటీవల రైతులు మార్కెట్లకు తమ పం ట ఉత్పత్తులను తరలించారు. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలతో అవి తడిసి ముద్దయ్యాయి. జిల్లాలో పన్నెండు వ్యవసాయ మార్కెట్లు ఉన్నప్పటికీ ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి, పిట్లం, మద్నూర్ మార్కెట్లలో మాత్రమే క్రయవిక్రయాలు సాగుతున్నా యి. ఈ మార్కెట్ సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు 73,885 క్వింటాళ్ల మక్కలను నిజామాబా ద్, కామారెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ల లో రైతులు విక్రయించారు.
ఇందులో ప్రభు త్వ రంగ సంస్థలు 61 క్వింటాళ్ల మొక్కజొన్నలను మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేశాయి. మొక్కజొన్నకు ప్రభుత్వం రూ. 1,310 మద్దతు ధర ప్రకటించి నప్పటి కీ వ్యాపారులు మా త్రం ఆ ధరతో కొనుగోళ్లు చేయడం లేదు. రెం డు రోజుల కింద మొక్కజొన్న క్వింటాలుకు రూ. 1,216 పలుకగా శని వారానికి రూ. 1,160లకు పడిపోయింది. ధాన్యం ధర విషయంలోనూ ఇదే పరి స్థితి. ఇప్పటి వరకు జిల్లాలో పలు మార్కెట్ల లో 15,174 క్విం టాళ్ల వరి ధాన్యం క్రయవిక్రయాలు జరి గాయి. రెండు రోజుల క్రి తం క్వింటాల్ ధాన్యానికి రూ. 1,221 ధర పలుకగా నేడది రూ. 1,190కు పడిపోయింది. ఈ ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 1,345 కావడం గమనార్హం. రెండు రోజుల క్రితం పసుపు క్వింటాల్‌కు రూ. 4,700 నుంచి రూ. 5000 పలుకగా, ప్రస్తు తం రూ.4,500 నుంచి రూ.4,725 వరకు మాత్రమే పలుకుతోంది. ప్రభుత్వ ప్రక టిం చిన మద్దతు ధర రైతుకు లభించడం లేదు.
అడుగడుగునా ఆపద
Published Sun, Oct 27 2013 3:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement