భగీరథయత్నం
తొలకరి పలకరింపుతో పులకించిన రైతు పుడమి తల్లి నుదుట పచ్చబొట్టు పెట్టి సాగుకు నడుం కట్టాడు. ఆదిలో కురిసిన వర్షాలు పసిపాలల్లాంటి మొక్కలకు మురిపాలై జీవం పోశాయి. ఎదుగుతున్న మొక్కలను చూసిన రైతు..తన ఎదలో గూడుకట్టుకున్న అప్పుల దిగులు పోతుందని ఆశపడ్డాడు. నెల రోజులుగా చినుకు ముఖం చాటేయగా.. భానుడు భగభగమండుతున్నాడు. కాలువలన్నీ అడుగంటాయి. ఎదుగుతున్న మొక్కలు ఎండుముఖం పట్టాయి. చుక్కనీరు లేక వాడిన పుడమి తల్లి మోము చూసి రైతు కళ్లన్నీ కన్నీళ్లయ్యాయి. పెట్టుబడి రెట్టింపవుతున్నా బాడుగకు నీళ్లు తెచ్చుకుని మొక్కలకు పోస్తూ.. తన చెమట చుక్కలనే పంటకు ఆరుతడిగా మార్చి..వాన చినుకుకై ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తున్నాడు. – పిడుగురాళ్ళ