టీటీడీకి భారీ విరాళం... అయినా సామన్య దర్శనమే | at large donation of Ttd.. | Sakshi
Sakshi News home page

టీటీడీకి భారీ విరాళం... అయినా సామన్య దర్శనమే

Published Tue, May 5 2015 10:01 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

టీటీడీకి భారీ విరాళం... అయినా సామన్య దర్శనమే

టీటీడీకి భారీ విరాళం... అయినా సామన్య దర్శనమే

తిరుమల: హెచ్‌సీఎల్ కంపెనీ అధినేత శివ్‌నాడార్ మంగళవారం రాత్రి సామాన్య భక్తుడిలా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రాత్రి 8 గంటలకు ఆయన రూ.300 టికెట్ తీసుకుని సుఫథం ప్రవేశ మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ట్రస్టుల కోసం రూ.1 కోటి విరాళం ఇచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. శివ్‌నాడార్ టీటీడీకి అనేకమార్లు భారీ మొత్తాల్లో విరాళాలిచ్చారు.


తిరుమల ఆలయ నిబంధనల ప్రకారం రూ.5 లక్షలు, ఆపైన విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ, ఇతర ప్రత్యేక దర్శనాలు కేటాయిస్తారు. అయితే, తిరుమలకు వచ్చిన ప్రతిసారీ పెద్ద మొత్తాల్లో విరాళాలు ఇచ్చే శివ్‌నాడార్ ఎలాంటి ప్రత్యేక మర్యాదలు ఉపయోగించుకోరు. టీటీడీ ద్వారా కేవలం రూ.300 టికెట్లు మాత్రమే తీసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement