hlc
-
తుంగభద్రకు వరద
సాక్షి, అనంతపురం, కర్నూలు: తుంగభద్ర జలాశయానికి రానున్న రెండురోజుల్లో లక్ష క్యూసెక్కులు చొప్పున వరద ఉధృతి వచ్చే అవకాశముందని తుంగభద్రబోర్డు అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. గురువారం ఉదయం లెక్కల ప్రకారం తుంగభద్ర జలాశయానికి 39,142 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జలాశయంలో 100.855 టీఎంసీలు నీటిమట్టం కొనసాగిస్తూ వచ్చిన నీటిని వచ్చినట్లుగా 38,890 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి ఎగువున వర్షాలు అధికం అవుతున్న నేపథ్యంలో రెండురోజులోల 50 వేల క్యూసెక్కుల నుంచి లక్ష క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో పెరగవచ్చునని బోర్డు అధికారులు తెలిపారు. ప్రత్యేక చర్యలు తీసుకోండి తుంగభద్ర నదికి వరద హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని బొమ్మనహాల్, కణేకల్, డీ.హీరేహల్, ఉరవకొండ మండలాల తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యనారాయణ ఆదేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో ఆయా మండలాల్లోని గ్రామాల్లో దండోరాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు రావడం వలన తుంగభద్ర జలాశయం తీవ్ర వర్షాభావాన్ని చవి చూసింది. ఆగష్టులో కురిసిన వర్షాలకు తుంగభద్ర జలాశయం నిండింది. ఆగష్టు నుంచి సెప్టెంబర్ వరకూ జలాశయానికి వరద వస్తుండటంతో గత నెల రోజులుగా నీటిని దిగువకు వదిలేస్తున్నారు. తాజాగా మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. గత ఆగష్టులో దాదాపు 2.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేశారు. తాజాగా లక్ష క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుందని అంచనా వేస్తుండడంతో ఆ నీటిని కూడా దిగువకు వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు భారీ ఎత్తున వరద నీరు వస్తుండటంతో హెచ్చెల్సీకి ప్రమాదం పొంచి ఉందని, నీటిపారుదల శాఖ, రెవెన్యూ , పోలీసులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బొమ్మనహాళ్ తహసీల్దార్ అనీల్‌కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన రెవెన్యూ , ఇరిగేషన్ సిబ్బందితో కలిసి నీటి మట్టాన్ని పరిశీలించారు. సరిహద్దులో హెచ్చెల్సీ కాలువ నీటి మట్టాన్ని పరిశీలిస్తున్న అధికారులు హెచ్చెల్సీ ప్రధాన కాలువకు కూడా నీటి మట్టాన్ని పెంచారని ఎక్కడైనా ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది కాలువ పొడవునా అప్రమత్తంగా ఉండాలన్నారు. తుంగభద్ర ప్రధాన కాలువకు ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసర గేట్ల ద్వారా నీటిని వేదావతి హగరికి మళ్లించే అవకాశం ఉన్నందున హగరి పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఆంధ్ర సరిహద్దుల్లోని హెచ్చెల్సీకి 1700 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు చెప్పారు. -
హెచ్చెల్సీకి నీటి విడుదల
బొమ్మనహాళ్/హోస్పేట: జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ కాలువకు బుధవారం తుంగభద్ర మండలి అధికారులు నీటిని వదిలారు. హెచ్చెల్సీ కాలువకు సంబంధించిన రెండు గేట్లకు తుంగభద్ర మండలి కార్యదర్శి డి.రంగారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.లక్ష్మప్ప, అసిస్టెంట్ కార్యదర్శి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గేట్లకు సంబంధించిన స్విచ్ ఆన్ చేసి కాలువకు నీటిని విడుదల చేశారు. ప్రారంభంలో వంద క్యూసెక్కుల వరకు నీటిని వదిలారు. గంట గంటకు వంద క్యూసెక్కుల వరకు నీటి సామర్థ్యాన్ని పెంచుతూ మొత్తం 500 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా మండలి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తుంగభద్ర మండలి ఇంజినీర్ శ్రీనివాస నాయక్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పీటముడి
హెచ్చెల్సీకి నీటి విడుదల సందిగ్ధం - నేడు టీబీ డ్యాం అధికారుల సమావేశం – జిల్లాలో పూర్తిగా అడుగంటిని తాగునీటి ప్రాజెక్టులు – ఎంపీఆర్, సీబీఆర్‌లో చుక్కనీరు కరువు – మరో 20 రోజుల్లో అడుగంటనున్న పీఏబీఆర్ – తీవ్రమవుతున్న తాగునీటి సమస్య సాక్షిప్రతినిధి, అనంతపురం: తాగునీటి ప్రాజెక్టులు అడుగంటినా ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదా? ఎంపీఆర్, సీబీఆర్ తరహాలో పీఏబీఆర్లోనూ నీరు అడుగంటనుందా? ఇదే జరిగితే ‘అనంత’ తాగునీటి సంక్షోభంలో చిక్కుకోనుందా? తాజా పరిణాలు నిశితంగా పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. సాగునీరు పక్కనపెడితే కనీసం తాగునీటి విషయంలోనూ ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోంది. తుంగభద్ర డ్యాంలో సరిపడా నీరున్నా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేయించడంలో ఘోరంగా విఫలమవడం విమర్శలకు తావిస్తోంది. హెచ్చెల్సీపై ఆధారపడి ‘సీమ’లోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 2.84లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే తుంగభద్ర బోర్డు మాత్రం 32.5టీఎంసీలలో ఏటా సగటున 22 టీఎంసీలు మాత్రమే కేటాయిస్తోంది. ఈ కేటాయింపులు కూడా సక్రమంగా అందడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. విడుదల చేసే నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోని పరిస్థితి. ఈ క్రమంలో ‘అనంత’ సాగునీటి అవసరాలు తీర్చేందుకు టీబీడ్యాం నుంచి కేసీ కెనాల్(కర్నూలు–కడప కెనాల్)కు దక్కాల్సిన 10టీఎంసీలను హెచ్చెల్సీ ద్వారా మళ్లించేలా జీఓ జారీ చేశారు. దీంతో 42.5టీఎంసీలు హెచ్చెల్సీకి టీబీ బోర్డు కేటాయించాలి. ఈ కోటా నీళ్లు దక్కించుకునేలా ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది. అయితే కేటాయింపులు సంగతి పక్కనపెడితే తాగునీటి అవసరాలకు కూడా నీరు తెప్పించలేకపోతుండటం గమనార్హం. ప్రభుత్వ వైఫల్యంతోనే తాగునీటి సమస్య హెచ్చెల్సీపై ఆధారపడి పీఏబీఆర్, సీబీఆర్లతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి. ఏటా జూలైలో టీబీ డ్యాంకు హెచ్చెల్సీ నుంచి నీరు విడుదల చేస్తారు. ఈ ఏడాది ఆగస్టు ముగుస్తున్నా నీటి విడుదల ఊసే కరువయింది. దీంతో సీబీఆర్(చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)లో పూర్తిగా నీరు అడుగంటింది. ఎంపీఆర్(మిడ్పెన్నార్డ్యాం)లో అదే పరిస్థితి. పీఏబీఆర్‌లో ఒక టీఎంసీలోపే నీరుంది. మరో 20–30రోజుల్లో ఈ నీరు అడుగంటనుంది. ఇప్పటికే సీబీఆర్ పరిధిలో ధర్మవరం, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలకు తాగునీటి సమస్య ఉత్పన్నమైంది. గతేడాది కంటే సమృద్ధిగానే డ్యాంలో నీటి నిల్వ గతేడాది ఈ సమయానికి టీబీ డ్యాంలో 52.703 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూలైలో ఐఏబీ సమావేశం నిర్వహించి 23.1 టీఎంసీలు కేటాయించారు. ఇందులో 8.5టీఎంసీలు తాగునీటికి, 14.6టీఎంసీలు సాగుకు కేటాయించారు. ప్రస్తుతం డ్యాంలో 53.775 టీఎంసీలు ఉండగా.. 4300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా కనీసం తాగునీటికి కూడా నీటిని విడుదల చేయలేదు. మంత్రులు, జిల్లా యంత్రాంగం ఘోర వైఫల్యం ‘అనంత’కు తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్, హెచ్చెల్సీ ఎస్ఈ టీబీ బోర్డుకు కొద్దిరోజుల కిందట విజ్ఞప్తి చేశారు. అయితే బోర్డు అధికారులు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆధారపడి విడుదల చేస్తామని చెప్పారు. ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టీబీబోర్డు అధికారులతో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత కూడా నీరు విడుదల చేయలేదు. కర్ణాటకలో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఏడాది ఎలాగైనా కర్ణాటకలోని ఆయకట్టుకు నీరిచ్చి పంటలు పండించాలనే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. అనంత తాగునీటి అవసరాలకు నీరు విడుదల చేస్తే కర్ణాటక రైతులు చౌర్యానికి పాల్పడుతారని, అందుకే నీరు విడుదల చేయలేదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే సకాలంలో నీరు విడుదల చేయించడంలో ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు మంత్రులు కూడా ఘోర వైఫల్యం చెందారు. హెచ్చెల్సీపై ఆధారపడి 40వేల ఎకరాల్లో వరిసాగు చేస్తారు. ఇందులో సింహభాగం మంత్రి కాలవ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలోనే ఉంది. అయినప్పటికీ ఆయన స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 30న ఐఏబీ సమావేశం జరుగనుంది. ఆ సందర్భంగా నీటి విడుదల తేదీని ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా ఆదివారం టీబీ డ్యాం అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వచ్చే నెల 2న హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
క్రాప్ హాలిడే తప్పదా..?
- తుంగభ్రద డ్యామ్‌లో ఆశించిన స్థాయిలో లేనినీరు - హెచ్చెల్సీ ఆయకట్టు కింద పంటసాగు ప్రశ్నార్థకం - రైతులను జాగృత పరిచే దిశగా అధికారుల అడుగులు కణేకల్లు : హెచ్చెల్సీ ఆయకట్టు కింద ఈ ఏడాది పంట సాగు ప్రశ్నార్థకంగా మారింది. తుంగభద్ర డ్యామ్‌లో నీటి పరిస్థితి దారుణంగా ఉండటంతో ఆయకట్టుకు సాగునీరివ్వకూడదనే ఆలోచనలో జిల్లా అధికార యంత్రాంగం ఉన్నట్లు సమాచారం. దామాషా ప్రకారం హెచ్చెల్సీకి వచ్చే నీరు తాగునీటి అవసరాలకు వాడుకోవాలని నిర్ణయించారు. డ్యామ్‌లో ఇప్పుడున్న నీటి పరిస్థితి దృష్ట్యా వరి కాదు కదా... ఆరుతడి పంటలకు కూడా నీరిచ్చే పరిస్థితిలో లేమని అధికారులు తేల్చి చెబుతున్నారు. చూస్తుంటే హెచ్చెల్సీ ఆయకట్టు కింద ఈ ఏడాది క్రాప్ హాలిడే తప్పదా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. 36 వేల ఆయకట్టు హెచ్చెల్సీ కింద కణేకల్లు, బొమ్మనహళ్, విడపనకల్లు మండలాల్లో 15 డిస్ట్రిబ్యూటరీలు, కణేకల్లు చెరువు కింద మొత్తం 36 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గత ఏడాది తుంగభద్ర డ్యామ్ పరివాహక ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా డ్యామ్‌లో నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. దీంతో దామాషా ప్రకారం హెచ్చెల్సీకి 10.50 టీఎంసీల నీరు కేటాయించారు. ఈ నీళ్లు కూడా తాగునీటికే సరిపోయాయి. ఎప్పటిలాగే రైతులు ముందుగా వరినారు పోసుకొని నాట్లకు సిద్ధంగా ఉండటంతో సాగునీరివ్వకపోతే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉండటంతో ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో అడపదడప సాగునీరిచ్చి రైతులను గట్టెక్కించారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు సైతం సక్రమంగా ఇవ్వలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. సాగునీరు డౌటే.. ప్రస్తుతం టీబీ డ్యామ్‌లో 40.955 టీఎంసీలతో 1612.83 అడుగుల నీరు నిల్వ ఉంది. టీబీ డ్యామ్‌కు ఇప్పుడున్న ఇన్‌ఫ్లో... నీటి నిల్వ, తగ్గుతున్న ఇన్‌ఫ్లో ఈ లెక్క ఆధారంగా టీబీ డ్యామ్‌లో నీటిమట్టం పెరిగే అవకాశం లేదని బోర్డు అధికారులు తేల్చి చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హెచ్చెల్సీకి 10 టీఎంసీలకు మించి నీరొచ్చే అవకాశం లేదు. ఈ నీళ్లను తాగునీటితో పాటు సాగుకు సర్దుబాటు చేయడం కుదరదన్న అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఈ క్రమంలో డ్యామ్ పరిస్థితి గురించి ఏమాత్రం లెక్క చేయకుండా వరినారు పోసుకొని పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులను జాగృతి చేయాలని హెచ్చెల్సీ అధికారులు నిర్ణయించారు. ఇన్‌ఫ్లో పెరిగితే చూద్దాం ఆయకట్టుకు ఒక్కసారిగా సాగునీరివ్వలేమని చెబితే రైతులు ఉద్రిక్తతకు లోనయ్యే అవకాశముండటంతో తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో పెరిగితే సాగుకు నీరిచ్చే విషయం ఆలోచిస్తామని చెప్పి ఆయకట్టు రైతులను నచ్చ చెప్పాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే ఇన్‌ఫ్లో ఆశించినంత లేదు కాబట్టి... ఇప్పడు సాగుకు నీరివ్వలేం. భవిష్యత్తులో ఇన్‌ఫ్లో పెరిగి నీటి లభ్యత పెరిగితే ఏ ఇబ్బంది లేకుండా నీరిస్తామని చెప్పాలని నిర్ణయించారు. నేడు సాగునీటి సంఘాల అధ్యక్షులతో భేటీ కణేకల్లులోని హెచ్చెల్సీ అతిథి గృహంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు సాగునీటి సంఘాల అధ్యక్షులతో అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని సాగునీటి సంఘాల అధ్యక్షులకు కబురు పెట్టినట్లు కణేకల్లు హెచ్చెల్సీ సబ్ డివిజన్ డీఈఈ రామసంజన్న తెలిపారు. టీబీ డ్యామ్‌లో నీటి పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో హెచ్చెల్సీ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో ఆయకట్టు రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. -
ఇంకెంత కాలమీ పనులు?!
ముందుకు సాగని హెచ్చెల్సీ ఆధునీకీకరణ పనులు నెల.. రెండు నెలలు కాదు.. ఏకంగా 96 నెలలకు పైగా తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆధునీకీకరణ పనులు సాగుతూ.. ఉన్నాయి! 2009లో జిల్లా సరిహద్తులోని 105వ కిలోమీటరు నుంచి 189వ కిలోమీటరు వరకూ ఆధునీకీకరణ పనుల కోసం రూ. 475 కోట్లను అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పనులు అనుకున్న స్థాయిలో జరిగి ఉంటే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఆధునీకీకరణ పనులు నత్తనడకన సాగుతుండడంతో పంటలకు సాగునీరు అందడం లేదు. పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది కూడా పనులు పూర్తి అవుతాయనే నమ్మకం లేదు. హెచ్చెల్సీ ద్వారా జిల్లాకు 32 టీఎంసీల నీరు అందాల్సి ఉండగా ప్రస్తుతం 18 టీఎంసీలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. ప్రధాన కాలువ వెడల్పు లేకపోవడంతో.. లైనింగ్ దెబ్బతినడం వల్ల తరచూ గండ్లు పడుతూ జిల్లాకు సాగునీరు సక్రమంగా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. దీంతో హెచ్చెల్సీ ఆధునీకీకరణకు ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వం పనులు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రధాన కాలువను వెడల్పు చేయడంతో పాటు సిమెంట్ లైనింగ్ చేయాల్సి ఉంది. మోపిడి వద్ద నత్తనడకన ఉరవకొండ మండలంలోని మోపిడి గ్రామం వద్ద డీప్ కట్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో కాలువ వెడల్పు 15 మీటర్లు ఉంది. ఇందులో 2,500 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అవకాశం ఉంది. కాలువ సామర్థ్యాన్ని 15 నుంచి 25 మీటర్లుకు పెంచడం ద్వారా 4,500 కూసెక్కుల నీటి ప్రవాహానికి అనుకూలం చేయాలని అధికారులు భావించారు. ఆ మేరకు చర్యలూ చేపట్టారు. ప్రస్తుతం మోపిడి వద్ద 172 కిలోమీటరు నుంచి 188 కిలోమీటరు వరకు పనులు సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో డీప్ కట్ వద్ద పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించేందుకు డిటనేటర్లను ఉపయోగించాల్సి ఉంది. ఈ పనులను పూర్తి చేయకుండానే లైనింగ్ పనులు చేపట్టారు. హెచ్చెల్సీలో షట్టర్లు సైతం తుప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి. కాలువ గట్లు ఎక్కడపడితే అక్కడ కోతకు గురవుతున్నాయి. పనులు వేగవంతం చేస్తాం.. : రామసంజప్ప, డీఈ, హెచ్చెల్సీ ఆరో ప్యాకేజీ పనులు వేగవంతం చేయనున్నాం. ప్రస్తుతం లైనింగ్, సూపర్ ప్యాసెస్ పనులు జరుగుతున్నాయి. 188వ కిలోమీటరు వద్ద బ్లాస్టింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తాం. నిధుల సమస్య లేదు. -
అంతులేని జాప్యం
- నత్తనడకన హెచ్చెల్సీ ఆధునికీకరణ - అర్ధంతరంగా ఆగిన బ్రిడ్జిల నిర్మాణం - నేటికీ ప్రారంభం కాని యూటీ పనులు జిల్లాకు వరదాయని అయిన తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆధునికీకరణపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. తాగు, సాగు నీరందించే ఈ కాలువ గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పనుల గడువు పొడిగించుకుంటూనే వెళ్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు పొడిగించినా పురోగతి మాత్రం కన్పించడం లేదు. కణేకల్లు (రాయదుర్గం) : హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు అలసత్వం చూపుతుండటంతో అనుకున్న పురోగతి కన్పించడం లేదు. కాలువ శిథిలావస్థకు చేరుకుని సాగునీటి సరఫరాకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతుండటంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెచ్చెల్సీ ఆధునికీకరణకు రూ.475 కోట్లు మంజూరు చేశారు. 2,400 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యమున్న కాలువను 4,200 క్యూసెక్కులకు పెంచుతూ కాలువను వెడల్పు చేయాలని నిర్ణయించారు. ఆధునికీకరణ పనులను ఆరు ప్యాకేజీలుగా విభజించారు. 2008లో పనులు ప్రారంభమయ్యాయి. 2012లోనే పూర్తి కావాల్సి ఉండేది. ఆది నుంచి కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. హెచ్చెల్సీకి నీరు బంద్ అయిన వెంటనే పనులు ప్రారంభించకపోవడమే ఇందుకు కారణం. నీరు బంద్ అయిన రెండు, మూడు నెలలకు పనులు ప్రారంభించి.. జూలై రెండో వారం వరకు అడపాదడపా చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. వీటి గురించి జిల్లా మంత్రులు, చీఫ్ విప్, ఎమ్మెల్యేలు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కాంట్రాక్టర్ల కోరిక మేరకు ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు సార్లు గడువు ఇచ్చింది. ఆగస్టు 2018లోగా పనులు పూర్తి చేయాలని తుది గడువు విధించింది. ఈ తొమ్మిదేళ్లలో ఒక్కో ప్యాకేజీలో 60 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో తుది గడువులోపు కూడా పూర్తి కావడం అనుమానంగానే కన్పిస్తోంది. అసంపూర్తిగా బ్రిడ్జిలు హెచ్చెల్సీ వ్యవస్థలో కీలకమైన అండర్ టన్నెళ్లు (యూటీ), బ్రిడ్జిలు, అక్విడెక్ట్ పనుల్లో ఏమాత్రమూ పురోగతి లేదు. కొందరు కాంట్రాక్టర్లు బ్రిడ్జి పనులను ప్రారంభించారు. ఇవి కూడా పిల్లర్ల స్థాయిలో ఆగిపోయాయి. ఇప్పటి వరకు ఏ బ్రిడ్జి కూడా పూర్తిగా రూపుదిద్దుకోలేదు. ఇక యూటీ పనులు ఏ ఒక్కటీ ప్రారంభించలేదు. పాత యూటీలను తొలగిస్తే కొత్త వాటిని ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాలువకు నీరొచ్చే సమయానికే పూర్తి కావాలి. దీంతో కాలువకు నీరు బంద్ అయిన వెంటనే పనులు చేపట్టాలని హెచ్చెల్సీ ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా కాంట్రాక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ ఏడాది కూడా యూటీ పనులు జరగవనే తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటరీలదీ అదే పరిస్థితి 2, 3 ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీ పనులపై ప్రధాన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేయడంతో వాటిని హెచ్చెల్సీ అధికారులు ఎస్ఆర్ కంపెనీకి అప్పగించారు. రెండో ప్యాకేజీలో 2ఏ, 3వ డిస్ట్రిబ్యూటరీ పనులు, మూడో ప్యాకేజీలో 4, 5, 6బీ, 6బీ1ఆర్ డిస్ట్రిబ్యూటరీ పనులను ఎస్ఆర్ కంపెనీతో చేయిస్తున్నారు. నాల్గో ప్యాకేజీలో ప్రధాన కాంట్రాక్టర్ 7, 8వ డిస్ట్రిబ్యూటరీ పనులను పూర్తి చేశారు. మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు 96 శాతం వరకు జరిగాయి. ఒకటో ప్యాకేజీలో కురువళ్లి, 2వ డిస్ట్రిబ్యూటరీ పనులు ప్రారంభం కాగా.. ఒకటో డిస్ట్రిబ్యూటరీ పనులు నేటికీ మొదలు కాలేదు. ప్యాకేజీ సంఖ్య నిధుల కేటాయింపు కేటాయించిన కి.మీలు పనిశాతం 1 రూ.65.55 కోట్లు 10 54 2 రూ.77.96 కోట్లు 15 52 3 రూ.69.92 కోట్లు 14 46 4 రూ.108 కోట్లు 18 58 5 రూ.66.655 కోట్లు 10 27 6 రూ.87.55 కోట్లు 17.50 52 గడువులోగా పూర్తి చేస్తాం కొన్ని ప్యాకేజీలకు జూన్, మరికొన్ని ప్యాకేజీలకు ఆగస్టు 2018 వరకు గడువు ఇచ్చాం. పనులను పర్యవేక్షిస్తున్న డీఈఈలతో 15రోజులకోసారి ప్రొగ్రెస్ రిపోర్ట్ తీసుకుంటున్నాం. పనులు వేగవంతమయ్యేలా చూస్తున్నాం. కాంట్రాక్టర్లకు మరోసారి గడువు ఇచ్చేది ఉండదు. యూటీ పనులు చేయాలనుకుంటే ఆలస్యం లేకుండా ప్రారంభించాలని సూచించాం. - కె.వెంకటరమణారెడ్డి, హెచ్చెల్సీ ఈఈ -
హెచ్చెల్సీకి నీరు బంద్
► ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూటరీల షట్టర్లు దించేసిన ► పంటలకు డిసెంబర్ నెలాఖరు వరకు నీళ్లు అవసరం ► చివర్లో చేతులెత్తేసిన ప్రభుత్వంపై రైతన్నల ఆగ్రహం కణేకల్లు : కేటాయించిన నీటి వాటా పూర్తి కావడంతో తుంగభద్ర జలాశయం అధికారులు ఆదివారం సాయంత్రం నుంచి హెచ్చెల్సీకి నీటి సరఫరా నిలిపేశారు. తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి మొత్తం 10.50 టీఎంసీల నీరు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. పరీవాహక ప్రాంతంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది తుంగభద్రకు నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. ఆ మేరకు హెచ్చెల్సీ వాటాగా 10 టీఎంసీల నీరు కేటాయించారు. కేసీ కెనాల్ నుంచి 1 టీఎంసీ నీరు డైవర్ష¯ŒS చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 0.5 టీఎంసీలు మాత్రమే తీసుకున్నారు. హెచ్చెల్సీకి నీటి సరఫరా ఆగిపోవడంతో హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలోని కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల్లో వరి, జొన్న, మొక్కజొన్న సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. తమ పంటలను కాపాడుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రా సరిహద్దు నుంచి కణేకల్లు మార్గమధ్యంలో హెచ్చెల్సీకి రెండు చోట్ల ఉన్న క్రాస్ షట్టర్లను పూర్తిగా దించేసి కాల్వలో నీరు నిల్వ చేసుకున్నారు. ఆంధ్రా సరిహద్దు 105 కిలోమీటర్ తర్వాత ఉన్న కురువళ్లి డిస్టిబ్య్రూటరీ, 1వ డిస్టిబ్య్రూటరీలోని పంటలను కాపాడేందుకు నాగాలాపురం వద్ద రైతులు షట్టర్లను దించేశారు. దీనివల్ల ఈ రెండు డిస్టిబ్య్రూటరీలకు మూడురోజులు నీరందే అవకాశముంది. 2, 2ఏ, 3, 4వ డిస్టిబ్య్రూటరీల రైతులు అంబాపురం వద్ద హెచ్చెల్సీకున్న షట్టర్లను దించారు. దీంతో ఈ నాలుగు డిస్టిబ్య్రూటరీలకు రెండు రోజుల పాటు నీరందుతుంది. హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలో 36 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 25 వేల ఎకరాల్లో రైతులు వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ పంటలు సాగు చేశారు. ప్రతి ఏటా డిసెంబర్ నెలాఖరు, జనవరి మొదటి వారం వరకు ఆయకట్టుకు సాగునీరు అందించేవారు. కానీ ఈసారి ఎన్నడూ లేని విధంగా రెండవవారంలోనే హెచ్చెల్సీకి నీరు బంద్ కావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరి, జొన్న, మొక్కజొన్నలాంటి ఆరుతడి పంటలు బతకాలంటే డిసెంబర్ వరకు నీరు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోని రైతులు ఏదోక విధంగా పంటలను కాపాడుతామని చెప్పి చివరికి చేతులెత్తేసిని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈనెల 15వ తేదీ వరకు హెచ్చెల్సీకి నీరు తీసుకోవాలని అధికారులు అనుకున్నప్పటికీ డ్యామ్‌లో హెచ్చెల్సీ హెడ్‌కు నీరు పూర్తి స్థాయిలో అందకపోవడం, వస్తున్న కొద్దిపాటి నీరునూ కర్ణాటక వారు వాడుకుంటూ ఉండటం వల్ల ఆ ప్రయత్నాలు ఆపేశారు. ప్రస్తుతం డ్యామ్‌లో 11.368 టీఎంసీల నీరుంది. 300 క్యూసెక్కులు వస్తున్నాయి ఈ నెల 15 వరకు పూర్తిస్థాయిలో నీరు తీసుకోవాలని అనుకొన్నాం. డ్యామ్‌లో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. 1,591 అడుగుల వరకే నీరుండటంతో హెచ్చెల్సీ హెడ్ కు కావాల్సినంత నీరు అందడం లేదు. అరకొరగా వస్తున్న నీటిని కర్ణాటక వాళ్లే వాడుకుని 300 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ఈ రోజు రాత్రికో, సోమవారం ఉదయానికో ఆ నీరు కూడా పూర్తిగా ఆగిపోతుంది. పంటలను సంరక్షించుకునేందుకు రైతులు నాగాలాపు రం, అంబాపురం వద్ద షట్టర్లను దించుకున్నారు. కణేకల్లు చెరువు కింద సాగులో ఉన్న పంటల కోసం చెరువు షట్టర్లను కూడా క్లోజ్ చేశారు. – వెంకట సంజన్న, డీఈఈ -
హెచ్ఎల్సీలో బాలుడి గల్లంతు
గార్లదిన్నె : గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాం గ్రామానికి చెందిన చాకలి లక్ష్మిదేవి, నరసింహులు దంపతుల కుమారుడు రాము(16) హెచ్ఎల్సీలో పడి గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం... తల్లిదండ్రులతో కలసి హెచ్ఎల్సీ కాలువలో దుస్తులు ఉతికేందుకు బుధవారం వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడి, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అవతలి వైపు గట్టునున్న పశువుల కాపర్లు గమనించి గట్టిగా కేకలు వేయడంతో రాము తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. అందరూ కలసి రాము కోసం గాలించారు. అయినా అతని ఆచూకీ దొరకలేదు. ఉన్న ఏకైక కుమారుడు ఇలా కళ్లెదుటే నీటిలో కొట్టుకుపోవడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బిడ్డ ఆచూకీ తెలపాలని అందరినీ వేడుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు వెంటనే ఈతగాళ్లతో కాలువ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం వరకు గాలించినా బాలుడిని కనుగొనలేకపోయారు. -
హెచ్ఎల్సీలో బాలుడి గల్లంతు
గార్లదిన్నె : గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాం గ్రామానికి చెందిన చాకలి లక్ష్మిదేవి, నరసింహులు దంపతుల కుమారుడు రాము(16) హెచ్ఎల్సీలో పడి గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం... తల్లిదండ్రులతో కలసి హెచ్ఎల్సీ కాలువలో దుస్తులు ఉతికేందుకు బుధవారం వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడి, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అవతలి వైపు గట్టునున్న పశువుల కాపర్లు గమనించి గట్టిగా కేకలు వేయడంతో రాము తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. అందరూ కలసి రాము కోసం గాలించారు. అయినా అతని ఆచూకీ దొరకలేదు. ఉన్న ఏకైక కుమారుడు ఇలా కళ్లెదుటే నీటిలో కొట్టుకుపోవడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బిడ్డ ఆచూకీ తెలపాలని అందరినీ వేడుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు వెంటనే ఈతగాళ్లతో కాలువ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం వరకు గాలించినా బాలుడిని కనుగొనలేకపోయారు. -
హెచ్చెల్సీలో ఇద్దరు గల్లంతు
అనంతపురం సెంట్రల్ : స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి హెచ్చెల్సీలో గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు .... కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన ముత్యాలప్ప కుమారుడు అనిల్‌బాబు(13) అనంతపురంలోని బీసీ హాస్టల్లో ఉంటూ కలెక్టరేట్‌కు సమీపంలోని రాజేంద్ర మునిసిపల్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం తోటి స్నేహితులు మూర్తి, అనిల్‌తో కలిసి గుత్తిరోడ్డు సమీపాన గల హెచ్చెల్సీలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. కాసేపు ముగ్గురు విద్యార్థులు సరదాగా గడిపారు. అనిల్‌బాబుకు ఈతకొట్టడంలో అనుభవం ఉందనే ధీమాతో కాలువ మధ్యలోకి దూకాడు. నీటి ప్రవాహ వేగానికి బయటకు రావడానికి కష్టమైందో.. లేక లోపల రాళ్లు ఏవైనా బలంగా తగిలాయో తెలియదు కానీ అనిల్‌బాబు పైకి రాలేదు. దీంతో కంగారుపడిన స్నేహితులు స్థానికులతో మొరపెట్టుకున్నారు. దీంతో వారు త్రీటౌన్ సీఐ గోరంట్లమాధవ్, ఎస్ఐ రెడ్డప్పకు సమాచారం అందించారు. ఎంత గాలించినా కానరాని జాడ సీఐ మాధవ్, ఎస్ఐ రెడ్డప్ప గజ ఈతగాళ్లతో కలిసి హెచ్చెల్సీవద్దకు చేరుకున్నారు. తాడు సాయంతో సీఐ మాధవ్ నేరుగా రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. పొద్దుపోయేంత వరకూ గాలించినా విద్యార్థి ఆచూకి తెలియరాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. మరో యువకుడు.. బుక్కరాయసముద్రం: బుక్కరాయసముద్రం మండల పరి«ధిలోని గాయిత్రినగర్కు చెందిన ఓ యువకుడు హెచ్చెల్సీలో గల్లంతైన సంఘటన సోమవారం చోటు చే సుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. గాయిత్రినగర్కు చెందిన వడ్డె ఎరుకులయ్య(35) సోమవారం మద్యం సేవించి హమాలీ కాలనీ వద్ద ఉన్న పీనుగుల బ్రిడ్జి వద్ద కాలువలో స్నానం చేయడానికి వచ్చాడన్నారు. అక్కడ కాలువ వద్ద అందరూ చూస్తుండగానే కాలువలో స్నానం చేయడానికి దిగారు. నీరు వేగంగా వస్తుండటంతో నీటిలో కొట్టుకపోయాడన్నారు. స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఎరుకులయ్య ఆచూకీ కనిపించ లేదు. -
ఆయుకట్టుకు గండం
హెచెఎల్సీ కింద తొలిసారి ‘క్రాప్ హాలిడే’ సూచనలు టీబీ డ్యాంకు ఆశించిన స్థాయిలో చేరని నీరు హంద్రీ–నీవాకు పుష్కలంగా నీరొస్తేనే ఊరట జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయానికి (టీబీ డ్యాం) ఈ ఏడాది ఆశించిన స్థాయిలో నీరు చేరడం లేదు. నది పరీవాహక ప్రాంతంలో వర్షాభావానికి తోడు ఎగువన నిర్మించిన ప్రాజెక్టులతో డ్యాంలోకి ఇన్‌ఫ్లో గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల ఈ ఏడాది తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) కింద ఆయకట్టుకు నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. తొలిసారిగా ‘క్రాప్ హాలిడే’ సూచనలు కన్పిస్తున్నాయి. అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పరిధిలో మొత్తం 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ ఆయకట్టులో ప్రతియేటా దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయి. టీబీ డ్యాంలో ఆశించిన మేర నీరు చేరకపోవడమే ఇందుకు కారణం. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో 74 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఈ ఏడాది 51 టీఎంసీలు మాత్రమే ఉంది. ముఖ్యంగా డ్యాంలోకి నీటి చేరిక (ఇన్‌ఫ్లో) మందకొడిగా ఉంది. గత ఏడాది ఈ సమయంలో 22,971 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఈ సారి మాత్రం 14,667 క్యూసెక్కులే వస్తోంది. అది కూడా వారం నుంచి పెరిగింది. పదిరోజుల క్రితం నాలుగు వేల క్యూసెక్కులే ఉండేది. దీనివల్ల ఆయకట్టుకు నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోనే అత్యధిక ఆయకట్టు హైలెవల్ మెయిన్ కెనాల్(హెచ్‌ఎల్‌ఎంసీ) పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లో ఉంది. ఇక్కడ ప్రతి ఏటా వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఎప్పుడూ ఈ సమయానికి మెయిన్ కెనాల్ పరిధిలో పంటలకు నీరు వదిలేవారు. ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మెయిన్ కెనాల్ పరిధిలోనే ఇలా ఉంటే.. ఇక ఉపకాలువల పరిధిలో ఆయకట్టుకు నీరివ్వడం అసాధ్యమేనని రైతులు అంటున్నారు. నీరివ్వకపోతే మెయిన్ కెనాల్ పరిధిలోని ఆయకట్టుదారుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందేమోనని అధికారులు, ప్రజాప్రతినిధులు ముందే ఆ ప్రాంత రైతులతో సమావేశాలు నిర్వహించారు. రెండేళ్లుగా ఇబ్బందులే గత ఏడాది హెచ్‌ఎల్‌ఎంసీ, గుంతకల్లు బ్రాంచ్‌కెనాల్ (జీబీసీ) కింద పంటలకు అరకొరగా నీరొదిలారు. మిడ్‌పెన్నార్ సౌత్, నార్త్ కెనాల్స్æ, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ (టీబీసీ) తదితర వాటికి చుక్కనీరు కూడా వదలలేదు. ఈ సారైనా ఇస్తారనే ఆశతో ఉన్న రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం టీబీ డ్యాంలో ఉన్న నీటి నిల్వను పరిగణనలోకి తీసుకుంటే హెచ్చెల్సీ వాటా మరో నెల రోజుల్లో ముగిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది దామాషా ప్రకారం హెచ్చెల్సీకి 22 టీఎంసీల నీరు వస్తుందని అంచనా వేశారు. గత నెల 25 నుంచి రోజూ 1,200 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఇప్పటికి మూడున్నర టీఎంసీలు వచ్చాయి. మన కోటా మరో నెల రోజుల్లో ముగిస్తే 15 టీఎంసీలకు మించి వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. హంద్రీ–నీవా ఆదుకునేనా? ఈ ఏడాది టీబీ డ్యాం నిరుత్సాహ పరిచినా శ్రీశైలం డ్యాం మాత్రం తొణికిసలాడుతోంది. దాని నుంచి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నాయి. ప్రస్తుతం జీడిపల్లి జలాశయంలో నీటిని నిల్వ చేస్తున్నారు. త్వరలో అక్కడి నుంచి పీఏబీఆర్, మిడ్‌పెన్నార్ రిజర్వాయర్‌కు విడుదల చేయనున్నారు. హంద్రీనీవాకు పుష్కలంగా నీరొస్తే మిడ్‌పెన్నార్ సౌత్, నార్త్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టు కింద ఆరుతడి పంటలకైనా ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. నీరు తీసుకురావడంలో విఫలం అయితే ఈ ఏడాది కూడా క్రాప్‌హాలిడే ప్రకటించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
హెచ్చెల్సీలో పెరిగిన నీటి ఉధృతి
ఉరవకొండ : మండలంలోని మోపిడి గ్రామం వద్ద ఉన్న లింక్ చానల్ నుంచి పెన్నహోబిళం బ్యాలె న్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్) కు 1150 క్యూసెక్కులు, మిడ్ పెన్నార్ డ్యాంకు 400 క్యూసెక్కుల నీటిని అధికారులు మళ్ళించారు. గత వారం రోజుల నుంచి కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర ఎగువ కాలువకు నీటి ఉధృతి పెరిగింది. నింబగల్లు హెడ్ రెగ్యులేటర్ వద్ద హెచ్చెల్సీ నీటి ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతుండటంతో అధికారులు నీటిని ఎక్కువ శాతం జలాశయాలకు మళ్లిస్తున్నారు. -
సాగునీరు అసాధ్యం
- వచ్చేది 11 టీఎంసీలు మాత్రమే - అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీఎంసీలు - వరిని రైతులెవ్వరూ సాగు చేయకూడదు - అక్రమ ఆయకట్టుదారులపై కఠినంగా వ్యవహరించాలి - ఐఏబీ సమావేశంలో తీర్మానం అనంతపురం అర్బన్/ ఇరిగేషన్ : ‘తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీకి 22.689 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. నెల రోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఎగువ నుంచి నీరు రాకపోవడంతో 11 టీఎంసీలు మాత్రమే ఇస్తామని టీబీ డ్యాం అధికారులు చెబుతున్నారు. ఇందులో అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీంఎసీలు ఇవ్వాలి. మిగిలిన నీటిని ఏమి చేయాలనేది తరువాత నిర్ణయిద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో వరి ఏ ఒక్క రైతూ సాగు చేయకుండా చూడాలి. అలాగే అక్రమ ఆయకట్టుదారుల పట్ల కఠినంగా వ్యవహరించాల’ని నీటి పారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం కమిటీ చైర్మన్, కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్‌రెడ్డి, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినిబాల, జెడ్పీ చైర్మన్ చమన్, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ ఆవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, జేసీ ప్రభాకర్‌రెడ్డి, వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి, ప్రభాకర్‌చౌదరి, ఈరన్న, జితేంద్రగౌడ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే జయరామప్ప, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, పయ్యావుల కే శవ్, శమంతకమణి హాజరయ్యారు. నీటి విడుదలకు సంబంధించి వాస్తవ పరిస్థితిని సభ్యులకు కలెక్టర్ వివరించారు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య తీవ్రంగా మారిందన్నారు. గత ఏడాది ఇదే సమయంలో టీబీ డ్యాంలో ఇన్‌ఫ్లో 1.22 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఇప్పుడు ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే ఉందన్నారు. గత ఏడాది ఈ సమయానికి డ్యాంలోకి 113 టీఎంసీల నీరొస్తే, ఇప్పుడు 12 టీఎంసీలు మాత్రమే వచ్చిందన్నారు. అటు శ్రీశైలం డ్యాంలోనూ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయిందన్నారు. హెచ్చెల్సీ ద్వారా అనంతపురం జిల్లాలో 1.47 లక్షల ఎకరాలు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు కలిపి 69 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదన్నారు. హామీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సలహా మండలి సమావేశం వద్దనుకున్నామని, అయితే వాస్తవాలను సభ్యుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని వివరిం చారు. దీంతో సభ్యులు తొలి ప్రాధాన్యత తాగునీటికి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. -
వరికి ఉరి
- సాగునీరివ్వలేం.. రైతులెవ్వరూ వరి సాగు చేయకూడదు - టీబీ డ్యాం నుంచి వచ్చేది 11 టీఎంసీలు మాత్రమే - అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీఎంసీలు - అక్రమ ఆయకట్టుదారులపై కఠినంగా వ్యవహరించాలి - ఐఏబీ సమావేశంలో తీర్మానం అనంతపురం అర్బన్/ ఇరిగేషన్ : ‘తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీకి 22.689 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. నెల రోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఎగువ నుంచి నీరు రాకపోవడంతో 11 టీఎంసీలు మాత్రమే ఇస్తామని టీబీ డ్యాం అధికారులు వరికి ఉరి చెబుతున్నారు. ఇందులో అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీంఎసీలు ఇవ్వాలి. మిగిలిన నీటిని ఏమి చేయాలనేది తరువాత నిర్ణయిద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో ఏ ఒక్క రైతూ వరి సాగు చేయకుండా చూడాలి. అక్రమ ఆయకట్టుదారుల పట్ల కఠినంగా వ్యవహరించాల’ని నీటి పారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం కమిటీ చైర్మన్, అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్‌రెడ్డి, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినిబాల, జెడ్పీ చైర్మన్ చమన్, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ ఆవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, జేసీ ప్రభాకర్‌రెడ్డి, వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి, ప్రభాకర్ చౌదరి, ఈరన్న, జితేంద్రగౌడ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే జయరామప్ప, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, పయ్యావుల కే శవ్, శమంతకమణి హాజరయ్యారు. నీటి విడుదలకు సంబంధించి వాస్తవ పరిస్థితిని సభ్యులకు కలెక్టర్ వివరించారు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య తీవ్రంగా మారిందన్నారు. గత ఏడాది ఇదే సమయంలో టీబీ డ్యాంలో ఇన్‌ఫ్లో 1.22 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఇప్పుడు ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే ఉందన్నారు. గత ఏడాది ఈ సమయానికి డ్యాంలోకి 113 టీఎంసీల నీరొస్తే, ఇప్పుడు 12 టీఎంసీలు మాత్రమే వచ్చిందన్నారు. అటు శ్రీశైలం డ్యాంలోనూ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయిందన్నారు. హెచ్చెల్సీ ద్వారా అనంతపురం జిల్లాలో 1.47 లక్షల ఎకరాలు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు కలిపి 69 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదన్నారు. హామీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సలహా మండలి సమావేశం వద్దనుకున్నామని, అయితే వాస్తవాలను సభ్యుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని వివరించారు. దీంతో సభ్యులు తొలి ప్రాధాన్యత తాగునీటికి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. భవిష్యత్‌లో డ్యాంలలో నీటిమట్టం పెరిగితే సాగునీటి అవసరాల కోసం చర్చించడానికి ఆగస్టు చివరి వారంలో మరోసారి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను మొదటి నుంచి నిర్లక్ష్యం చేస్తున్నారని వైఎస్సార్ జిల్లా ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. వృథా అరికట్టాలి : సతీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ స్పీకర్ చిత్రావ తి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు కేటాయించిన నీళ్లు ఎప్పుడూ చేరలేదు. చాలా వరకు వృథా అవుతున్నాయి. దీనిని అరికట్టకపోతే తాగునీటికి కూడా చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. కేటాయించిన నీరు సీబీఆర్‌కు చేరాలంటే ఎక్కువ నీటిని విడుదల చేస్తేనే సాధ్యం. మూడేళ్లుగా మైలవరానికి నీళ్లు లేవు : ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే మూడేళ్లుగా మైలవరం ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరుగుతున్నా, ఏ ఏడాదీ ఒక చుక్క రావడం లేదు. మా ప్రాంతంలో 1500 నుంచి 2000 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీళ్లు పడటం లేదు. పరిస్థితి భయానకంగా ఉంది. ఈ ఏడాది కేటాయించిన నీటిని విడుదల చేస్తేకానీ మా ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడదు. మా గురించి ఆలోచించే తీరిక లేదా? : వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎంపీ గత ఐఏబీ సమావేశంలో కూడా మా ప్రాంతానికి నీళ్లు రావడం లేదని వివరించా. అయినప్పటికీ గత ఏడాది మాకు తీవ్ర అన్యాయం జరిగింది. సీబీఆర్‌కు రెండు టీఎంసీలు కేటాయించినా, రిజర్వాయర్‌లోకి ఒక్క టీఎంసీ నీరు కూడా రావడం లేదు. తుంపెర వద్ద నీటి ప్రవాహం సూచించే గేజ్ ఏటవాలుగా ఉంది. దానితో రిజర్వాయర్‌లోకి ఎక్కువ నీరు వచ్చినట్లు అధికారులు ఊహించుకుంటున్నారు. తక్షణమే హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తి చేసి సీబీఆర్‌కు నాలుగు టీఎంసీలివ్వాలి. -
టీటీడీకి భారీ విరాళం... అయినా సామన్య దర్శనమే
తిరుమల: హెచ్‌సీఎల్ కంపెనీ అధినేత శివ్‌నాడార్ మంగళవారం రాత్రి సామాన్య భక్తుడిలా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రాత్రి 8 గంటలకు ఆయన రూ.300 టికెట్ తీసుకుని సుఫథం ప్రవేశ మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ట్రస్టుల కోసం రూ.1 కోటి విరాళం ఇచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. శివ్‌నాడార్ టీటీడీకి అనేకమార్లు భారీ మొత్తాల్లో విరాళాలిచ్చారు. తిరుమల ఆలయ నిబంధనల ప్రకారం రూ.5 లక్షలు, ఆపైన విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ, ఇతర ప్రత్యేక దర్శనాలు కేటాయిస్తారు. అయితే, తిరుమలకు వచ్చిన ప్రతిసారీ పెద్ద మొత్తాల్లో విరాళాలు ఇచ్చే శివ్‌నాడార్ ఎలాంటి ప్రత్యేక మర్యాదలు ఉపయోగించుకోరు. టీటీడీ ద్వారా కేవలం రూ.300 టికెట్లు మాత్రమే తీసుకుంటారు. -
మంత్రి ఇంటి ఎదుట ఆందోళన
అనంతపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఇంటి ఎదుట సీపీఐ కార్యకర్తలు నిరసనకు దిగారు. మంగళవారం పెద్ద ఎత్తున మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నకార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. ఎచ్‌ఎల్‌సీ ఆధునికరణ పనులు వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా కార్యకర్తలు డిమాండ్ చేశారు. అనంతరం మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా ఆయన నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు మంత్రి ఇంటి గోడలకు వినతిపత్రం పోస్టర్లను అంటించారు. -
రైతన్నల వర్రీ
అనంతపురం టౌన్ : వర్షాభావ పరిస్థితులు, నీటి కేటాయింపుల్లో కోత నేపథ్యంలో తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆయకట్టు కింద వరి సాగును తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను సమాయత్తం చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే..చాలామంది రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. హెచ్చెల్సీ కింద 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లాలో ప్రతియేటా లక్ష ఎకరాల వరకు సాగునీరు అందించేవారు. కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల ఆయకట్టును భారీగా కుదిస్తున్నారు. ఈ ఏడాది ఆరు వేల హెక్టార్లలో వరి, 74 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు. రెండు, మూడేళ్ల నుంచి హైలెవల్ మెయిన్ కెనాల్ (హెచ్‌ఎల్‌ఎంసీ), గుంతకల్లు బ్రాంచి కెనాల్ (జీబీసీ), పీఏబీఆర్ సౌత్ కెనాల్, నార్త్ కెనాల్, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ), మైలవరం బ్రాంచ్ కెనాల్, పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) కింద 60-80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం నీటి కేటాయింపులు ఆశాజనకంగా ఉండవంటూ వరిని పూర్తిగా తగ్గించాలని నిర్ణయించారు. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, కూరగాయలు, పొద్దుతిరుగుడు, వేరుశనగ లాంటి పంటలను సిఫారసు చేస్తున్నారు. రైతులు మాత్రం హెచ్చెల్సీ ఆయకట్టులో ఎక్కువ శాతం భూములు వరి మినహా వేరే పంటలకు పనికిరావని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా హెచ్‌ఎల్‌ఎంసీ కింద 20 నుంచి 25 వేల ఎకరాలలో వరి మాత్రమే వేస్తారు. అనధికారికంగా మరో 5 -8 వేల ఎకరాల వరకూ సాగు చే స్తారు. దీంతో పాటు హెచ్ఎల్సీ సౌత్, నార్త్ కెనాల్ కింద మెజార్టీ రైతులు వరినే నమ్ముకుంటున్నారు. దీంతో అధికారులు నిర్ణయించిన విస్తీర్ణానికి మించి సాగులోకి వచ్చే అవకాశముంది. గతేడాది కంటే విపత్కర పరిస్థితులు జిల్లాకు సాగు, తాగునీటి విషయానికొస్తే గతేడాది కంటే ఈసారి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతేడాది హెచ్చెల్సీకి తొలుత 22 టీఎంసీలు కేటాయించినా దామాషా ప్రకారం చివరకు 19 టీఎంసీలు వచ్చాయి. దీంతో పాటు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేసిన జీవో ప్రకారం కేసీ కెనాల్ వాటా 10 టీఎంసీలలో రివర్ష్ డైవర్షన్ పద్ధతిపై దామాషా ప్రకారం నాలుగు టీఎంసీలను పీఏబీఆర్‌కు ఇచ్చారు. రాష్ట్ర విభజనతో పీఏబీఆర్‌కు నీరు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా గతేడాది ఆరు టీఎంసీలు వచ్చాయి. 1.95 టీఎంసీల సామర్థ్యమున్న జీడిపల్లి జలాశయాన్ని పూర్తిగా నింపడంతో పాటు రెండు నెలల పాటు నిరంతరాయంగా జలాశయం మరువ ద్వారా పీఏబీఆర్‌లోకి నీరు వచ్చాయి. గతేడాది పంటలకు ఇవ్వడంతో పాటు పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న 49 చెరువుల్లోకి నీటిని తీసుకుపోయారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు తాగునీటి అవసరాలకు పీఏబీఆర్తో పాటు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో సమృద్ధిగా నిల్వ చేశారు. ఆ పరిస్థితి ఈ ఏడాది ఉండదని అధికారులు అంటున్నారు. మిగులు జలాలపై ఆధారపడిన హంద్రీ-నీవా ప్రాజెక్టుకు ఈ సారి నీటి విడుదల పూర్తిగా అనుమానమేనని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిర్ణయంతో గతేడాది శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకున్నారు. విభజన కారణంగా ఈ ఏడాది నుంచి కృష్ణా బోర్డు ఆంగీకారంతోనే హెచ్ఎన్ఎస్ఎస్కు నీటి కేటాయింపులు ఉంటాయని వివరిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, రాష్ట్ర విభజన నేపథ్యంలో హెచ్చెల్సీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌లకు నీటి కేటాయింపులు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులు వరి సాగు చేయకపోవడమే మంచిదని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరుతడి పంటలే మేలు హెచ్చెల్సీ కింద ఈ ఏడాది రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవడమే చాలా మేలు. గతేడాదితో పోలిస్తే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఒక్క వర్షం కూడా రాలేదు. హెచ్చెల్సీకి దామాషా ప్రకారం 22 టీఎంసీల నీటిని కేటాయించారు. చివర్లో వర్షాలు రాకపోతే కేటాయింపులు తగ్గుతాయి. కావున రైతులు వరి సాగు చేస్తే తీవ్రంగా నష్టపోతారు. - వాణినాథ్రెడ్డి, ఎస్ఈ, హెచ్చెల్సీ -
సమాంతర కాలువకు ‘సుదర్శన ’ చక్రం అడ్డు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నో అవాంతరాల తర్వాత తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ)కు సమాంతర కాలువ ప్రతిపాదనపై కర్ణాటక సర్కారు సానుకూలంగా స్పందిస్తుంటే.. మన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శనరెడ్డి మాత్రం మోకాలడ్డే యత్నం చేస్తున్నారు. సమావేశానికి మంత్రి గైర్హాజరు కావాలని నిర్ణయించిన నేపథ్యంలో బెంగళూరులో శుక్రవారం నిర్వహించనున్న సమావేశ లక్ష్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తుంగభద్ర నదిపై కర్ణాటక-ఆంధప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా హొస్పేట వద్ద 133 టీఎంసీల సామర్థ్యంతో తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారు. దీని నుంచి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే.. హెచ్చెల్సీకి సమాంతర కాలువ తవ్వి, టీబీ డ్యామ్‌కు వరద వచ్చే సమయంలో వైఎస్సార్ జిల్లాలోని పీఏబీఆర్, ఎంపీఆర్, సీబీఆర్, మైలవరం రిజర్వాయర్లను నింపుకుని, ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించవచ్చునని నీటి పారుదల రంగ నిపుణులు దశాబ్దాలుగా చెబుతూ వస్తున్నారు. కానీ ఈ ప్రతిపాదనను కర్ణాటక, ప్రధానంగా బళ్లారి జిల్లా రైతులు ససేమిరా అంటూ వచ్చారు. కానీ.. ఇటీవల బళ్లారి రైతుల్లో మార్పు వచ్చింది. సమాంతర కాలువ వల్ల తమకు కూడా ప్రయోజనం ఉంటుందని గుర్తించారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే సమాంతర కాలువపై పలుమార్లు కర్ణాటకు విజ్ఞప్తి చేశారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. సర్వే చేయించి సమాంతర కాలువ వల్ల ఇరు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని తేల్చారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల ప్రతినిధి బృందంతో శుక్రవారం(తొలుత గురువారం అనుకుని.. వాయిదా వేశారు) బెంగళూరులో సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ప్రతినిధి బృందాన్ని పంపాలని కర్ణాటక సర్కారు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణకు నీటిని తెచ్చే ఆర్డీఎస్కు అన్యాయం జరుగుతుందనే సాకు చూపి బెంగళూరు సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శనరెడ్డి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. దీంతో రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, కలెక్టర్ లోకేష్‌కుమార్ తదితరులు సమావేశానికి హాజరుకానున్నారు. అయితే.. సమాంతర కాలువ తవ్వకం వల్ల ఆర్డీఎస్కు ఎలాంటి అన్యాయం జరగదని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్త్తున్నారు. -
హెచ్చెల్సీకి సమాంతర వరద కాలువ అవసరం
సాక్షి,బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర డ్యాం పరిధిలోని హెచ్ఎల్సీకి సమాంతర వరద కాలువలను నిర్మించడం చాలా అవసరమని, ఈ విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. ఆయన గురువారం జిల్లాలోని తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. అనంతపురం జిల్లాకు నీరు సక్రమంగా అందడం లేదంటూ హెచ్ఎల్సీ ఈఈ ఇంగళగి, ఎస్డీఓ వెంకటరామయ్యలకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు ప్రతి రోజు 1200 క్యూసెక్కుల నీరు చేరుతున్నందున దామాషా ప్రకారం నీరు చేరుతుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా అనంతపురం జిల్లాకు 32.5 టీఎంసీలు నీరు అందాల్సి ఉండగా, 24 టీఎంసీల కన్నా ఎక్కువ నీరు చేరడం లేదని గుర్తు చేశారు. అందువల్ల జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి తుంగభధ్ర డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 207 టీఎంసీలు నది ద్వారా బయటకు వెళ్తోందన్నారు. ఆ నీరు వృథాగా వెళుతున్నప్పుడు అనంతపురం జిల్లాకు నీరు ఉపయోగించుకునే విధంగా సమాంతర వరద కాలువ నిర్మాణంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కాలువతో కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు మేలు జరుగుతున్నందున ఇరు రాష్ట్రాలు సమ్మతిస్తాయనే నమ్మకం ఉందన్నారు. ఈ ఏడాది హెచ్ఎల్సీ ద్వారా 32 టీఎంసీలతోపాటు అదనంగా 10 టీఎంసీలు సరఫరా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం హెచ్ఎల్సీ పరిధిలో నానాయకట్టు ఎక్కువగా ఉన్నందున ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అధికారులు తగిన చొరవ తీసుకుని అక్రమ ఆయకట్టు దారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడుతున్నందున హెచ్ఎల్సీ ద్వారా పీఏబీఆర్, ఎంపీఆర్ డ్యాంలకు పూర్తి స్థాయిలో నీరు అందే విధంగా హెచ్ఎల్సీకి నీరు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తుంగభద్ర డ్యాం నుంచి 207 టీఎంసీలు నీరు నది ద్వారా బయటకు వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. హెచ్ఎల్సీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే రూ.460 కోట్లు, ఎల్ఎల్సీకి రూ.1000 కోట్లు, డ్యాం మరమ్మతులకు రూ.260 కోట్ల నిధులు కావాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు నిధులు విడుదలయ్యే విధంగా ఇరు రాష్ట్రాల సీఎంలు సంసిద్ధత వ్యక్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సీపీఐ సీనియర్ నాయకులు ఎం.వీ.రమణ, జిల్లా సీపీఐ నాయకులు కాటమయ్య, మల్లికార్జున, హంపాపురం నాగరాజు, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
వరి రైతులకు మొండిచెయ్యేనా?
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : తుంగభద్ర ఎగువ కాలువ( హెచ్చెల్సీ) ఆయకట్టులో వరి పంటను సాగుచేసే రైతులకు ఈసారీ మొండిచేయి చూపుతున్నారు. వర్షాభావం, నీటి లభ్యతను సాకుగా చూపి రైతులను దగా చేస్తున్నారు. వరుసగా రెండో ఏడాదీ వరికి మంగళం పాడడంతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి జిల్లాకు కేటాయించిన మేరకు నీటిని తీసుకురావడంలో ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయశాఖ అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో బోరుబావులు, ఇతర నీటి వనరుల కింద 50 వేల ఎకరాల్లోను, కేవలం హెచ్చెల్సీ కింద 60-70 వేల ఎకరాల్లోను వరి సాగు చేస్తున్నారు. అంతటిప్రాధాన్యమున్న హెచ్చెల్సీ ఆయకట్టు కింద ఈ ఏడాది కూడా వరికి మంగళం పాడుతున్నారు. ఆరుతడి పంటలకు మాత్రమే నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే.. ఆయకట్టు పరిధిలో వరికి తప్పా మిగతా పంటలకు అనుకూలించని భూములు వేలాది ఎకరాలు ఉన్నాయి. ఈ భూములు కల్గిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరు విడుదల చేసే ముందు సాగునీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో సభ్యులు తీర్మానించిన మేరకు పంటలకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. జిల్లాకు కేటాయింపుల మేరకు నీటిని తీసుకురావడానికి ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఇదొక్క సమావేశమే అవకాశం. అయితే... ఈ ఏడాది సమావేశం నిర్వహించకుండానే నేరుగా పంటలకు నీటిని విడుదల చేస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. తొలుత పంచాయతీ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి సమావేశాన్ని వాయిదా వేశారు. ఆగస్టులో నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే.. ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమాలను సాకుగా చూపి ఐఏబీ తీర్మానం లేకుండానే నిర్ణయం తీసుకున్నారు. వరుసగా రెండో ఏడాదీ వరికి నీటిని విడుదల చేయకపోవడంపై ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, రైతు సంఘం నాయకులు నిలదీస్తారనే భయంతో అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సూచన మేరకే ఐఏబీ సమావేశం నిర్వహించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్చెల్సీపై అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో వేలాది మంది రైతులు ఆధారపడి ఉన్నారు. కాలువ కింద సుమారు 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రతియేటా దాదాపు 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.కాగా... కొన్నేళ్లుగా వర్షభావం, తుంగభద్ర జలాశయంలో పూడిక చేరిందనే సాకుచూపి జిల్లాకు నీటి కేటాయింపుల్లో భారీగా కోత వేస్తున్నారు. నికరంగా 24 టీఎంసీలకు పైగా జిల్లాకు రావాల్సి ఉన్నా .. ఎప్పుడూ 20 టీఎంసీల లోపే వదులుతున్నారు. గతేడాది మరీ తక్కువగా 18 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారు. దీనివల్ల ఇటు పంటలకే కాకుండా అటు తాగునీటికీ కటకటలాడాల్సి వస్తోంది. నీటి కేటాయింపుల్లో కోత కారణంగా గతేడాది ఆయకట్టును భారీగా కుదించారు. 55 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు మాత్రమే నీరందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారు. హైలెవల్ మెయిన్ కెనాల్ కింద 17,500 ఎకరాలు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) కింద ఐదు వేలు, పీఏబీఆర్ సౌత్ కెనాల్ కింద పది వే లు, నార్త్ కెనాల్ కింద నాలుగు వేలు, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ) కింద ఆరు వేలు, మైలవరం బ్రాంచ్ కెనాల్ కింద ఐదు వేలు, పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ) కింద 7,500 ఎకరాల్లో పంటలు సాగు చేయించాలని భావించారు. అయితే... చివరకు అన్ని ఉపకాల్వల కింద మొత్తం 67 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఏ సంస్కరణలు అమలు చేశారో ఈసారీ వాటినే అవలంబించాలని అధికారులు నిర్ణయించారు. తొలిప్రాధాన్యత తాగునీటికి ఇవ్వాలని నిర్ణయించారు. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి గత నెల 15 నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకూ తాగునీటి నిమిత్తం పీఏబీఆర్, ఎంపీఆర్ డ్యాంలలో నిల్వ చేశారు. ఈ నెల 8 నుంచి పంటలకు విడుదల చేస్తున్నారు. అయితే వరి సాగు చేయవద్దని అధికారులు రైతులకు చెబుతున్నారు. 80 రోజుల్లో పూర్తయ్యే జొన్న, మొక్కజొన్న, పప్పుశనగ తదితర ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఇప్పటికే వరి నారు వేసుకున్న రైతులు మాత్రం నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఆతర్వాత వరి పంటకు పూర్తి స్థాయిలో నీరు వస్తుందోలేదోనని ఆందోళన చెందుతున్నారు.