చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్ర పురపాలన చట్టం-1965 ను మరింత కఠినతరం చేస్తూ పురపాలక పరిపాలనా శాఖ రాష్ట్ర సంచాలకుడు (డీఎంఏ) బి.జనార్దన్‌రెడ్డి జి ల్లాలోని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల కమిషనర్లకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తూ భారీ మొత్తం లో జరినామాలు విధించడంతో పాటు ఆస్తి పన్ను విధింపులో లొసుగులు వెలికితీసే బాధ్యతను కమిషనర్లకు అప్పగించారు.
అదేవిధంగా ప్రతి అర్ధ సంవత్సరం ఆస్తి పన్నును ఒకేసారి చెల్లించే వారికి రాయితీ ప్రకటించారు. పట్టణాలు, నగరాల్లో అనుమతిలేకుం డా నిర్మిస్తున్న కట్టడాలు, అనుమతి తీసుకున్న కొలతల కంటే ఎక్కువ నిర్మాణం చేపట్టిన వారిపై డీఎంఏ కొరడా ఝళిపించారు. మునిసిపాలి టీలు, కార్పొరేషన్లలో ప్రతి నిర్మాణానికి ముందు స్థలం వదిలినా, వదలకపోయినా మిలిగిన మూడు దిక్కులా తప్పనిసరిగా ఐదు అడుగుల ఖాళీ స్థలం వదలాలి. జిల్లాలోని చాలా వరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల లో ఈ ఆదేశాలు అమలు కావడంలేదు.
ఐదు అడుగులు కాకుండా అర్ధ అ డుగు (10 శాతం) కుదించిన వారిపై కట్టడానికి విధించిన ఆస్తి పన్నులో 25 శాతం పెంచి జీవితాంతం వసూలు చేస్తారు. పది శాతానికి పైన నిబంధన లు అతిక్రమించిన వారికి 50 శాతం అదనంగా ఆస్తిపన్ను విధిస్తారు. పూర్తిగా ఒక ఫ్లోర్ నిర్మించడానికి అనుమతి తీసుకోకుండా పనులు చేపట్టిన వారికి ఆస్తి పన్ను రెట్టింపు చేస్తారు. అలాగే ఇంటి యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే అదనంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
వెసులుబాటు
ఇకపై మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కట్టడాలకు ఆస్తి పన్ను చెల్లించడం తప్పని సరి. ఒక ఏడాదిలో రెండు అర్ధ సంవత్సరాలకు సంబంధించిన ఆస్తి పన్ను ను ఏప్రిల్ 30 లోపు చెల్లించిన వారికి ఏటా వచ్చే ఆస్తి పన్ను మొత్తంలో 5 శా తం తగ్గించనున్నట్లు డీఎంఏ పేర్కొన్నారు. మరోవైపు మురికివాడలు కా కుండా పట్టణాలు, నగరాల్లో చాలా వరకు భవనాలకు ప్రతి అర్ధ సంవత్స రం రూ.500 లోపు ఆస్తి పన్ను వ సూ లు చేస్తున్నారు. రూ.500 లోపు ప న్ను వస్తున్న వాటిలో వాణిజ్య సముదాయాలు, సంపన్నవర్గాల ఇళ్లు ఉన్నట్లు హైదరాబాదు మహానగరపాలక సంస్థ లో బయటపడింది. ఈ నేపథ్యంలో జిల్లాలో సైతం తనిఖీలు చేపట్టాలని కమిషనర్లను ఆదేశించారు. జిల్లాలోని ఆరు మునిసిపాలి టీ లు, రెండు నగర పాలక సంస్థల్లో రూ. 500 లోపు ఆస్తిపన్ను వచ్చే అసెస్‌మెంట్ల సంఖ్య 50 వేలకు పైనే ఉండడం గమనార్హం.
అక్రమ కట్టడాలపై కొరడా
Published Sun, Oct 27 2013 4:01 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement