ఏ తల్లి కన్న బిడ్డో... | baby Found in Apsrtc bus | Sakshi
Sakshi News home page

ఏ తల్లి కన్న బిడ్డో...

Published Sat, Nov 18 2017 8:47 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

baby Found in Apsrtc bus - Sakshi

విజయనగరం ఫోర్ట్ ‌: ఆర్టీసీ బస్సులోని ఓ బ్యాగ్‌లో ఆడశిశువు లభ్యమైన ఘటన విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి రాజాం వెళ్లే బస్సు (ఏపీ 35 డబ్ల్యూ 9007)లోకి విశాఖలోని హనుమంతవాక ప్రాంతంలో ఓ వ్యక్తి ఒక బ్యాగ్‌తో ఎక్కాడు. అతను మార్గమధ్యలో బ్యాగ్‌ను వదిలేసి దిగిపోయాడు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు బస్సు ఉదయం 6:30 గంటలకు చేరుకోగా బ్యాగ్‌లోంచి చిన్న పిల్ల ఏడుపు రావడాన్ని బస్సు డ్రైవర్‌ సిహెచ్‌.రఘునాథ్, కండక్టర్‌ అప్పారావులు గమనించారు. దీంతో వారు బ్యాగ్‌ తెరిచి చూడగా అందులో ఆడశిశువు కనిపించింది. ఈ  విషయాన్ని వారు డిపో మేనేజర్‌ ఎన్‌.వి.ఎస్‌.వేణుగోపాల్‌ దృష్టికి తీసుకువెళ్లగా అతను శిశువును చైల్డ్‌ లైన్‌ సభ్యులకు అప్పగించారు. చైల్డ్‌లైన్‌ సభ్యులు శిశువును ఘోషాస్పత్రిలో చికిత్స నిమత్తం చేర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement