
అనంతలో బెంగళూరు మహిళ కిడ్నాప్.. లైంగిక దాడికి యత్నం
ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరంలో బెంగళూరుకు చెందిన శశికళ అనే మహిళను కిడ్నాప్ చేయడం.. బత్తలపల్లి దగ్గర ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడం కలకలం రేకెత్తించింది. ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, ధర్మవరం నియోజవర్గం ఇన్చార్జి వరదాపురం సూరి ప్రమేయముందని బాధితురాలు ఆరోపణలు చేసింది. తనకు బాకీ ఉన్న 30 లక్షల రూపాయిలు చెల్లిస్తామని చెప్పి, అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు వాపోయింది. దుండగుల బారి నుంచి బయటపడిన శశికళ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.