బ్యాంక్ ఉద్యోగుల సమ్మె | Bank employees strike | Sakshi
Sakshi News home page

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Dec 19 2013 4:50 AM | Updated on Sep 2 2017 1:45 AM

500 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు శాఖల ఉద్యోగులు నినాదాలు చేస్తూ విధులు బహిష్కరించారు.

బాలాజీచెరువు (కాకినాడ), న్యూస్‌లైన్ :  పదో ద్వైపాక్షిక వేతన ఒప్పందాన్ని వెంటనే అమలుచేయాలని, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు నిలుపుదల చేయాలనే డిమాండ్లతో యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్  పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేశారు. 500 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు శాఖల వఉద్యోగులు నినాదాలు చేస్తూ విధులు బహిష్కరించారు. దాంతో సుమారు రూ. 800 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. పలువురు వినియోగదారులు బ్యాంక్‌లకు వచ్చి ఇబ్బంది పడ్డారు. తమ డిమాండ్లు తీర్చకపోతే మరిన్ని నిరసన కార్యక్రమాలు నిరహిస్తామని బ్యాంక్ ఫోరం కన్వీననర్ ఆదినారాయణ మూర్తి తెలిపారు. ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయం వద్ద జరిగిన సమ్మెలో బ్యాంక్ ఫోరం నాయకులు పి.రమణ, మూర్తి, దేవదాసు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement