ఇరువర్గాల బాహాబాహీ మండల కన్వీనర్‌ను నిర్బంధించిన ఓ వర్గం
ఇరువర్గాల మధ్య ఘర్షణ పోలీసులకు పరస్పర ఫిర్యాదులు
రంగంలోకి దిగిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బోస్
పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లె తెలుగుదేశం పార్టీల మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం లక్కనపల్లెలో జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఇరువర్గాలవారు బాహాబాహీకి దిగి ఘర్షణలకు పాల్పడ్డారు. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఆ మండలంలో ఉద్రిక్తతనెలకొంది. పలమనేరు శాసనసభ టీడీపీ టికె ట్ కోసం ఆ పార్టీకి చెందిన బెరైడ్డిపల్లె మండల సీనియర్ నాయకులు లక్కనపల్లె శ్రీనివాసులు రెడ్డి, ప్రస్తుత పార్టీ ఇన్‌చార్జ్ సుభాష్‌చంద్రబోస్ తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. ఎట్టకేలకు పార్టీ టికెట్ బోస్‌కు వరించింది. మొన్న జరిగిన ఎన్నికల్లో బోస్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అమరనాథరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో శ్రీనివాసులు రెడ్డి తనకు వ్యతిరేకంగా పనిచేశారని బోస్ భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిరువురి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. గత కొన్నాళ్లుగా బెరైడ్డిపల్లె మండలంలో శ్రీ నివాసులురెడ్డి వర్గం, బోస్ వర్గాలుగా ఉంటున్నాయి. పార్టీ కన్వీనర్‌గా బోస్ వర్గానికి చెందిన డాక్టర్ కదిరప్పను ఏకపక్షంగా నియమించారని శ్రీనివాసులురెడ్డి వర్గం ఆగ్రహంతో ఉంది. ఇలా ఉండగా గత పది రోజు లుగా ఈ మండలంలోని పంచాయతీల్లో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా శుక్రవారం లక్కనపల్లెలో ఈ ఎన్నికల కోసం సమావేశం నిర్వహించారున బోస్ వర్గానికి చెందిన డాక్టర్ కదిరప్ప శ్రీనివాసులురెడ్డి సొంత గ్రామమైన లక్కనపల్లెకు వెళ్లి అక్కడ కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యా రు. విషయం తెలుసుకున్న శ్రీనివాసులురెడ్డి వర్గీయు లు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే వా రిని పట్టించుకోకుండా కదిరప్ప వారి వర్గానికి చెందిన రఘుచంద్రగుప్త వద్దకెళ్లి ఆయన సూచించిన పేర్లతో కమిటీని ఏర్పాటు చేసుకుని వచ్చారు. దీనిపై మరింత ఆగ్రహించిన శ్రీనివాసులు రెడ్డి వర్గీయులు కదిరప్పపై వాగ్వాదానికి దిగారు. ఇలా మొదలైన చిచ్చు ఇరువర్గా ల ఘర్షణలకు దారి తీసింది. అనంతరం తనను లక్కనపల్లెలో శ్రీనివాసులురెడ్డి వర్గీయులు నిర్బంధించారని కన్వీనర్ కదిర ప్ప బెరైడ్డిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కదిరప్ప వర్గీయులే తమపై దాడికి పాల్పడ్డారని పెద్దపురానికి చెందిన నాగరాజు, లక్కనపల్లెకు చెందిన శివకుమార్, రాజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హుటాహుటిన బెరైడ్డిపల్లె పోలీస్ స్టేషన్‌కెళ్లి తమ వర్గీయులకు అండ గా నిలిచారు. దీన్ని జీర్ణించుకోలేని శ్రీనివాసులురెడ్డి వర్గీయులు తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకుండా ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారినే స్టేషన్‌లో ఎలా కుర్చోబెడుతారంటూ వాగ్వాదానికి దిగారు. అయితే పూర్తిస్థాయిలో విచారణ జరిపాక ఈ సంఘటనపై తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. గత ఆరు నెలలుగా ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న పోరు దీంతో మరింత తారాస్థాయికి చేరినట్టైంది.
బెరైడ్డిపల్లె టీడీపీలో మళ్లీ భగ్గుమన్న విభేదాలు
Published Sat, Feb 14 2015 2:31 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement