కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావ పరిస్థితుల్లో రైతులు సకాలంలో వరి నాట్లు వేసుకోలేకపోతున్నారు. జిల్లాలో వరి సాధారణ సాగు 89 వేల హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 11 వేల హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఇటువంటి సమయంలో పంటకాలం నష్టపోకుండా దమ్ము చేసిన పొలంలో మొలక కట్టిన విత్తనాలను వెదజల్లుట, డ్రమ్ సీడర్‌తో నేరుగా విత్తుట, డ్రిప్ పద్ధతిలో వరిసాగు పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.
ఈ పద్ధతులతో ఏడు నుంచి పది రోజుల పంట కాలాన్ని ఆదా చేయవచ్చు. నారు పోయడానికి అయ్యే ఖర్చు తగ్గించవచ్చు. చీడ పీడల సమస్యలు కూడా చాలా తక్కువని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ముఖ్యశాస్త్రవేత్త డాక్టర్ నరసింహుడు తెలిపారు. డ్రమ్‌సీడర్ ద్వారా నేరుగా వరిని విత్తుకునే పద్ధతిలోని మెలకువలను ఆయన వివరించారు.
నేలలు.. విత్తన మోతాదు..
వరిసాగు చేసే అన్ని రకాల నేలల్లో ఈ పద్ధతిని పాటించవచ్చు. రకాన్ని బట్టి ఎకరాకు 12-18 కిలోల విత్తనం సరిపోతుంది. ప్రాంతానికి అనువైన ఏ రకమైనా సాగు చేయవచ్చు.
నీటి వాడకం..
నీటిని ఆరుతడిగా మాత్రమే పెట్టాలి. పొట్ట దశ వరకు నీరు నిలువకుండా బురదగా మాత్రమే ఉండాలి. పొట్ట దశ నుంచి పంట కోసే వారం రోజుల ముందు వరకు పొలంలో రెండు సెం.మీ., నీరు నిల్వ ఉండాలి.
డ్రమ్ సీడర్ పద్ధతే ఉత్తమం
Published Mon, Aug 18 2014 2:45 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement