Drip method
-
భర్త సహకారంతో పంటల సాగు..
నర్సాపూర్ (దండేపల్లి) : నర్సాపూర్ గ్రామానికి చెందిన నరెడ్ల సత్యనారాయ, విజయ దంపతులు పదిహేనుళ్లుగా వ్యవసాయం చేస్తున్నాయి. వారికి ఉన్న ఐదెకరాల భూమిలో ఏడేళ్లపాటు వరి సాగు చేశారు. దిగుబడి అంతంతమాత్రమే కావడంతో వరి సాగుకు స్వస్తి పలికారు. సత్యనారాయణ ఐటీఐలో మెటార్ మెకానిక్ చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయన్నే వృత్తిగా మలుచుకున్నాడు. వరి సాగుతో ఆశించిన లాభాలు రాకపోవడంతో వరికి బదులు ఐదెకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు చేశారు. లాభాల పంట పండడంతో కూరగాయలే సాగు చేస్తున్నారు. సత్యనారాయణ కూరగాయలను జన్నారం, ముత్యంపేట, దండేపల్లి, మేదర్పేట, తాళ్లపేట, లక్సెట్టిపేట, ద్వారకలో జరిగే వారసంతలకు తరలించి విక్రయిస్తుంటాడు. సాగు పనులన్నీ విజయ ముందుండి చేస్తోంది. సాగు వివరాలు ఆ దంపతుల మాటల్లోనే.. ఏడాది పొడవునా సాగు.. వరి, పత్తి వంటి పంటల సాగు మూడు నుంచి నాలుగు నెలల్లోనే పూర్తవుతుంది. కూరగాయల సాగు ఏడాదంతా చేపట్టవచ్చు. సీజన్ వారీగా డిమాండ్ ఎక్కువ ఉన్న వాటిని సాగు చేసి లాభాలు సాధించవచ్చు. మిర్చి, వంకాయ, టమాటా, బెండ, అలసంద, బీరకాయ, కాకరకాయ వంటి కూరగాయలను సాగు చేస్తున్నాం. వీటి సాడు ఏడాదంతా చేపడుతాం. సేంద్రియ పద్ధతిలో.. సత్యనారాయణ ఎన్‌పీఎం(నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్మెంట్) వీఏ(విలేజ్ అక్టివిటిస్ట్)గా పని చేస్తుం డడంతో కూరగాయల సాగును పూర్తిగా సేంద్రి య పద్ధతిలో చేపడుతున్నాం. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా ఇంటి వద్దనే సేం ద్రియ ఎరువులు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. కూరగాయల దిగుబడి బాగా వచ్చేందు కు నాడెపు కంపోస్టు ఎరువు, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, పంచగవ్వ, పేడ ఎరువును వాడడంతోపాటు రసం పీల్చే పురుగుల నివారణకు పంట చేళల్లో తెలుపు, పసుపు ప్లేట్ల ఏర్పాటు, వావిలాకు కషాయం, బ్రహ్మస్త్రం, అగ్రిహస్త్రం వంటి మందులు కూడా తయారు చేసి పిచికారీ చేస్తున్నట్లు విజయ పేర్కొన్నారు. డ్రిప్‌తో నీరు.. కూరగాయల సాగుకు నీటిని డ్రిప్ పద్ధతిలో అందిస్తున్నాం. కాలువలు ఏర్పాటు చేసి నీళ్లందించడంతో ఎక్కువ నీరు పడుతుంది. కాబట్టి వ్యవసాయ బావికి డ్రిప్ సిస్టమ్‌ను బిగించాం. డ్రిప్ తో మొక్కకు నేరుగా నీరందడంతోపాటు నీరు వృథా కాదు. ఎరువుల తయారీ ఇలా.. మనం పడేసే వ్యర్థ పదార్థాలు, పిచ్చిమొక్కలు, పశువుల పేడ, ఆవు మూత్రం వంటి వాటితో సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చు. నాడెపు కంపోస్టు ఎరువు.. దీంతో భూసారం పెరిగి పంట దిగుబడి వస్తుం ది. గడ్డి, కలుపు మొక్కలు ఒక చోట కుప్పగా వేయాలి వాటిపై ఆవుపేడ, మూత్రం చల్లాలి. ఒకసారి కుప్పగా వేసింది కొంత కుళ్లిపోగానే దానిపై మరో సారిగడ్డి, కలుపు మొక్కల కుప్ప వేసి మళ్లీ ఆవుపేడ, మూత్రం చల్లాలి ఇలా ఒకటి నుంచి 5 స్టెప్ల వరకు కుప్పగా వేయాలి 70 రోజుల్లో నాడెపు కాంపోస్టు ఎరువు తయారవుతుంది. దీనిని పంటలకు వేసుకోవచ్చు. ఘనజీవామృతం.. ఇది కూడా భూసార పెంపునకు ఉపయోగ పడుతుంది. క్వింటాళు ఆవుపేడ, 2 కిలోల బెల్లం, 2 కిలోల పిండి(పప్పుధాన్యాలతో తయారు చేసిం ది)తో తయారు చేసుకోవాలి. గుప్పెడు మట్టి వీ టన్నింటిని చూర్ణం చేసి చెట్టు మొదట్లో వేసినట్లయితే కాత బాగా కాస్తుంది. మొక్క, చెట్టు బలం గా ఉంటుంది. ఇది ఒక ఎకరాకు సరిపోతుంది. ధ్రవ జీవామృతం.. దీన్ని పిచికారీ చేయాలి.. 10 కిలోల ఆవుపేడ, 2 కిలోల బెల్లం, 2కిలోల పిండి(పప్పుదినుసులతో తయారు చేసింది) 200 లీటర్ల నీటిలో కలిపాలి. వారం రోజులపాటు నానబెట్టాలి. ప్రతి రోజు కలియ తిప్పాలి. ఆ తర్వాత పంటలకు పిచికారీ చేయవచ్చు. ఇది కూడా ఒక ఎకరానికి సరిపోతుంది. దీని ద్వారా చీడలను నివారించవచ్చు. పంచగవ్వ.. ఇది సూక్ష్మధాతు లోపానికి వినియోగించవ చ్చు. పావుకిలో ఆవునెయ్యి, 2 లీటర్ల చొప్పున ఆవు పాలు, పెరుగు, డజను అరటి పండ్లు, 2 లీటర్ల కొబ్బరి నీళ్లతో తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎకరాకు పిచికారీ చేయొచ్చు. పసుపు, తెలుపు ప్లేట్లు.. చేనులో పసుపు, తెలుపు రంగుతో ఇనుప ప్లేట్లు ఏర్పాటు చేసి వాటికి నాలుగురోజులకోసారి గ్రీసు రాస్తే రసం పీల్చే పురుగులు వాటిపై వాలి అతుక్కుంటాయి. ఇలా చేయడంతో రసం పీల్చు పురుగులు నివారించవచ్చు. ఇవే కాకుండా వివిధ రకాల తెగుళ్ల నివారణకు వావిలాకు, వేప ఆకులతో తయారు చేసిన కషాయాలు, బ్రహ్మస్త్రం, అగ్రిహస్త్రం వంటి వాటిని కూడా ఉపయోగించవచ్చు. -
ఖర్చు తక్కువ రాబడి ఎక్కువ
డ్రిప్ పద్ధతిలో బొప్పాయి సాగు ఎకరాకు రూ.లక్ష ఖర్చుతో రూ.2 లక్షల ఆదాయం పూతలపట్టు: డ్రిప్ పద్ధతిలో బొప్పాయి సాగుచేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని నిరూపిస్తున్నాడు పూతలపట్టు మండలం నొచ్చుపల్లె గ్రామానికి చెందిన రవి. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సాగు మంచి ఫలితాలు ఇస్తుండడంతో పలువురు రైతులు ఆ మార్గంలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. సాగు విధా నం, దిగుబడి గురించి రవి(9492548265) మాటల్లోనే చూద్దాం.. నాకున్న ఎకరా పొలంలో చాలా ఏళ్లుగా చెరుకు సాగు చేసేవాడిని. మొదట్లో దిగుబడి బాగా వచ్చినా రానురాను తగ్గిపోయింది. పైగా నీటి ఖర్చు కూడా ఎక్కువ. వ్యవసాయాధికారులను సంప్రదిస్తే పంట మార్పిడి చేయమన్నారు. పైగా డ్రిప్‌తో సాగు చేస్తే మంచి ఫలి తాలు ఉంటాయని చెప్పారు. వారి సూచన మేరకు తైవాన్ రెడ్ లేడి 786 రకం బొప్పాయి సాగుకు ఉపక్రమించాను. చెరుకు సాగుచేస్తే సంవత్సరానికి ఫలితం వచ్చేది. అదే బొప్పా యిలో ఆరు నెలల నుంచే దిగుబడి వస్తోంది. పైగా అంతకంతకు ఆదాయం ఉండడంతో ఆర్థికంగా కొంతమేరకు ఉపశమనం లభించింది. సాగు విధానం.. బొప్పాయి పంట సాగుకు మిట్టనేలలు మంచిది. ఎన్నుకున్న పొలాన్ని బాగా దున్నుకోవాలి. డ్రిప్ పైపులను అమర్చుకోవాలి. దీనికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ప్రతి ఆరు అడుగులకూ ఓ అడుగు లోతు గుంత తవ్వాలి. ఇందులో ముందుగా ఆవుల ఎరువును వేసి వారం, పది రోజులు మగ్గనివ్వాలి. తర్వాత అందులో మొక్కలు నాటాలి. నాటిన మూడు రోజులకు నీరు అందించాలి. తర్వాత నాలుగు రోజులకోసారి తడి ఇస్తే సరిపోతుంది. పూత, పిందె దశలో రోజు మార్చి రోజు నీరు అందిస్తే ఆరు నెలలకు దిగుబడి ప్రారంభవుతుంది. 25 రోజులకోసారి ఏడాది మొత్తం కాయలు కోతకు వస్తాయి. మొదటి నాలుగైదు కోతలకు కాయలు పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి మంచి ధర పలుకు తాయి. పోనుపోను కాయ సైజు తగ్గుతుంది కాబట్టి ధర కూడా అలాగే ఉంటుంది. సస్యరక్షణ.. బొప్పాయిలో ప్రతి 15 రోజులకోసారి మందు లు పిచికారి చేయాలి. చెట్లు పూతకు వచ్చే వరకు క్రిమికీటకాలు బారి నుంచి కాపాడుకునేందుకు ఫాంటాక్, టాటామిడా, ఎఫ్-4, బోరాన్ మందులు పిచికారి చేయాలి. కాపునకు వచ్చిన తర్వాత పిండినల్లి రాకుండా మందులు పిచికారీ చేసుకోవాలి. ఖర్చులు.. ఆదాయం ఎకరా నేల దున్నకాలకు రూ.2 వేలు ఖర్చవుతుంది. పేడ ఎరువు 10 లోడ్లకు రూ.20 వేలు అవుతుంది. ఎకరాకు 1,300 మొక్కలు అవసరమవుతాయి. రూ.10 చొప్పున రూ.13 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. గుంతలు తవ్వడానికి, మొక్కలు నాటడానికి రూ.13 వేలు, రెండు నెలలకొకసారి ఎరువులకు రూ.20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కలుపుతీతకు రూ.10 వేలు, మందులకు రూ.15 వేలు ఖర్చు అవుతుంది. డ్రిప్‌తో కలిపి మొత్తంగా దాదాపుగా రూ.లక్ష వరకు ఖర్చు వస్తుంది. ఆరు నెలల నుంచి దిగుబడి ప్రారంభవుతుంది. ప్రతి 25 రోజులకొకసారి కోత ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఏడాదికి 30 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో వాటి ధర కేజీ రూ.10 నుంచి 17 వరకు ఉంటుంది. ధర కేజీ రూ.10 అనుకున్నా రూ.3 లక్షలు వస్తుంది. ఖర్చులు లక్ష పోను దాదాపు రూ.2 లక్షలు మిగులుతుంది. -
డ్రమ్ సీడర్ పద్ధతే ఉత్తమం
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావ పరిస్థితుల్లో రైతులు సకాలంలో వరి నాట్లు వేసుకోలేకపోతున్నారు. జిల్లాలో వరి సాధారణ సాగు 89 వేల హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 11 వేల హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఇటువంటి సమయంలో పంటకాలం నష్టపోకుండా దమ్ము చేసిన పొలంలో మొలక కట్టిన విత్తనాలను వెదజల్లుట, డ్రమ్ సీడర్‌తో నేరుగా విత్తుట, డ్రిప్ పద్ధతిలో వరిసాగు పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ఈ పద్ధతులతో ఏడు నుంచి పది రోజుల పంట కాలాన్ని ఆదా చేయవచ్చు. నారు పోయడానికి అయ్యే ఖర్చు తగ్గించవచ్చు. చీడ పీడల సమస్యలు కూడా చాలా తక్కువని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ముఖ్యశాస్త్రవేత్త డాక్టర్ నరసింహుడు తెలిపారు. డ్రమ్‌సీడర్ ద్వారా నేరుగా వరిని విత్తుకునే పద్ధతిలోని మెలకువలను ఆయన వివరించారు. నేలలు.. విత్తన మోతాదు.. వరిసాగు చేసే అన్ని రకాల నేలల్లో ఈ పద్ధతిని పాటించవచ్చు. రకాన్ని బట్టి ఎకరాకు 12-18 కిలోల విత్తనం సరిపోతుంది. ప్రాంతానికి అనువైన ఏ రకమైనా సాగు చేయవచ్చు. నీటి వాడకం.. నీటిని ఆరుతడిగా మాత్రమే పెట్టాలి. పొట్ట దశ వరకు నీరు నిలువకుండా బురదగా మాత్రమే ఉండాలి. పొట్ట దశ నుంచి పంట కోసే వారం రోజుల ముందు వరకు పొలంలో రెండు సెం.మీ., నీరు నిల్వ ఉండాలి.