మూడేళ్లు దాటితే బదిలీ చేయాల్సిందే! | bhanwar lal comments | Sakshi
Sakshi News home page

మూడేళ్లు దాటితే బదిలీ చేయాల్సిందే!

Published Fri, Jan 31 2014 12:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

bhanwar lal comments

సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లలో మూడు సంవత్సరాలపాటు ఒకే నియోజకవర్గంలో పనిచేస్తున్న లేదా సొంత నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐలను వేరే నియోజకవర్గాలకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టంచేశారు. ఇక వరంగల్‌లో సమ్మక్క-సారలమ్మ జాతర అయ్యే వరకు ఆ జిల్లాలోని డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల బదిలీలకు మినహాయింపు ఇచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సూపరింటెండెంట్‌లు ఇంచార్జి మండల అభివృద్ధి అధికారి ఉంటే, వారినీ బదిలీ చేయాలన్నారు. భార్యాభర్తలు ఉద్యోగులైనప్పటికీ, పైన చెప్పిన నిబంధనల పరిధిలోకి వస్తే, సదరు భార్య లేదా భర్తను బదిలీ చేయాల్సిందేనని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement