'ఆళ్లగడ్డ' వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా భూమా అఖిలప్రియ
హైదరాబాద్: ఆళ్లగడ్డ శాసన సభ ఉప ఎన్నిక కోసం అభ్యర్ధిగా దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖారారు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణించినా ఆళ్లగడ్డ ఎన్నికలో అఖండ విజయం సాధించి దేశంలోని ఓ అరుదైన రికార్డును సాధించారు.
అయితే ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నిక సమయంలో పోటీ పెట్టవద్దని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ కోరారు. దాంతో నందిగామ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిని పోటీకి పెట్టని విషయం తెలిసిందే. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఆళ్లగడ్డ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అన్ని పార్టీలతో సంప్రదింపులు చేయటం కోసం వైస్ జగన్మోహన్ రెడ్డి ఒక ద్విసభ్య కమిటీని నియమించారు. దిసభ్య కమిటి సభ్యులుగా ఎంవీ మైసూరా రెడ్డి, ధర్మాన ప్రసాదరావులను ఎంపిక చేశారు.