
తిరుపతి సెంట్రల్: నిర్బంధంలో ఉన్న అభ్యుదయ రచయిత వరవరరావు(వీవీ) విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శనివారం లేఖ రాశారు. అనారోగ్యంతో వీవీ ఆసుపత్రిలో బందీగా ఉన్నారంటే హృదయం చమ్మగిల్లుతోందన్నారు.
తనకు లభించిన గురువుల్లో ఆయన కూడా ఒకరని తెలిపారు. 46 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ బాధితులుగా వెంకయ్య, తనతో పాటు వరవరరావు కూడా జైల్లో గడిపిన రోజులను గుర్తు చేశారు. రాజకీయ సిద్ధాంతాల్లోనూ, జన క్షేమం కోసం ఎవరి భావాలు వారివే అయినా మనుషులుగా అంతా ఒక్కటే అని పేర్కొన్నారు.