
అగ్నిప్రమాదంలో కాలిపోయిన మోటారు సైకిల్
పశ్చిమగోదావరి, కొవ్వూరు: పట్టణంలో ఈజీకే రోడ్డులోని హెచ్‌పీ పెట్రోలు బంక్ వద్ద పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో బైక్ నుంచి మంటలు వ్యాపించాయి. పెట్రోలు కొడుతున్న సమయంలో మోటారుసైకిల్ పెట్రోలు పైప్ లీకేజీ ప్రమాదానికి కారణంగా తెలిసింది. మండలంలో పశివేదల గ్రామానికి చెందిన మజ్జి దుర్గాప్రసాద్‌కు చెందిన మోటారుసైకిల్‌గా స్థానికులు చెబుతున్నారు. బైక్ నుంచి మంటలు రావడంతో బంకు సిబ్బంది, వాహనచోదకులు పరుగులు తీశారు. దుర్గాప్రసాద్ సైతం బంకుకు కొద్ది దూరంలో బైక్‌ను వదలి పరుగు తీశాడు. మంటలు చెలరేగిన వాహనాన్ని స్థానికులు, బంకు సిబ్బంది బంకు నుంచి బయటకు ఈడ్చుకురావడంతో పెనుప్రమాదం తప్పింది. మోటారుసైకిల్ పూర్తిగా కాలిపోయింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బంకు సిబ్బంది అగ్నిమాపక సిలెండర్‌తో మంటలను అదుపు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment