రేగిడి,న్యూస్‌లైన్:
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉం డేందుకు ముందస్తుగా పాల కొండ డివిజన్‌లో మూడువేల మందిపై బైండోవర్ కేసులు పెట్టామని డీఎస్పీ దేవానంద్‌శాంతో వెల్లడించారు. బుధవారం రేగిడి వచ్చిన ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు.
ఎన్నికలకు సంబంధించి డబ్బు, మద్యం అక్రమంగా తరలించకుండా ఉండేందుకు డివిజన్‌లో పది చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఇవి 24 గంటలూ పని చేస్తాయని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న సుమారు 8 లక్షల రుపాయలను ఇప్పటి వరకూ పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజాం, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో 170 సమస్యాత్మక గ్రామాలను గుర్తించామన్నారు. ఈ గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా సిబ్బందిని ఏర్పాటు చేస్తామని వివరించారు.
అనంతరం బూరాడ, పారంపేట గ్రామాల్లో డీఎస్పీ పర్యటించి ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని ప్రజలను కోరారు. ఆయన వెంట హెడ్‌కానిస్టేబుళ్లు రిప్పన్ రావు, సురేష్ కుమార్ ఉన్నారు.
3 వేల మందిపై బైండోవర్ కేసులు
Published Thu, Mar 20 2014 2:39 AM | Last Updated on Fri, May 25 2018 5:52 PM
Advertisement
Advertisement