bindover cases
-
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి సినీ సెలబ్రిటీ బైండోవర్
-
బొమ్మ తుపాకీతో డ్యాన్సులు.. దిమ్మ తిరిగే షాకిచ్చిన పోలీసులు
అమలాపురం టౌన్(తూర్పుగోదావరి): ఇద్దరు యువకులు ఓ బొమ్మ తుపాకీతో సరదాగా చేసిన హడావుడి.. చివరకు వారికి దిమ్మ తిరిగేలా చేసింది. అమలాపురం ఇన్చార్జి డీఎస్పీ ఎస్.రాంబాబు శుక్రవారం సాయంత్రం ఈ వివరాలను విలేకర్లకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన పోలిశెట్టి శివ గంగాధర్ ఏడాది కిందట కాకినాడలో ఏర్పాటు చేసిన ఓ క్రాఫ్ట్ బజారులో రూ.1,500కు ఓ బొమ్మ తుపాకీ కొన్నాడు. దానిని అలంకారంగా ఇంట్లో గోడకు తగిలించాడు. గ్రామంలో గురువారం రాత్రి మరిడమ్మ జాతర జరిగింది. ఆ జాతరకు తన అన్న కొడుకైన ఎనిమిదేళ్ల నందన్‌తో కలిసి శివ గంగాధర్ వెళ్లాడు. ఆ బాలుడి ముచ్చట పడటంతో వెంట బొమ్మ తుపాకీ కూడా తీసుకు వెళ్లాడు. వారికి దగ్గర బంధువైన పోలిశెట్టి నరసింహమూర్తి కూడా కలిశాడు. జాతరలో ఒక స్టేజీపై యువకులు సినిమా పాటలకు అనుగుణంగా డీజేలతో డ్యాన్స్ చేస్తున్నారు. అదే సమయంలో సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓ పాటకు అనుగుణంగా శివ గంగాధర్, నరసింహమూర్తి కూడా నృత్యాలు చేశారు. ఆ క్రమంలో బొమ్మ తుపాకీ పైకెత్తి చిందులు వేస్తూ సందడి చేశారు. అయితే నిజమైన తుపాకీతో వారు హల్చల్ చేసినట్టు ఒక టీవీ చానల్‌తో పాటు సోషల్ మీడియాలో శుక్రవారం ఉదయం వార్తలు ప్రసారమయ్యాయి. దీంతో కోనసీమ వ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. చల్లపల్లి చేరుకుని లోతైన విచారణ జరిపారు. చివరకు జాతరకు ఓ చిన్న పిల్లాడితో కలిసి వచ్చిన ఆకతాయిలు ఆ బొమ్మ తుపాకీ పట్టుకుని సరదాగా తిరిగారని తేల్చారు. బొమ్మ తుపాకీని స్వాధీనం చేసుకుని, దానితో జాతరకు వచ్చిన శివ గంగాధర్, నరసింహమూర్తిలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. చెక్క, పల్చటి రేకు గొట్టాలతో ఆట»ొమ్మలా తయారు చేసిన ఆ బొమ్మ తుపాకీని డీఎస్పీ విలేకర్లకు చూపించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ విలేకర్ల సమావేశంలో అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్‌బాబు, ఉప్పలగుప్తం ఎస్సై జి.వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. -
ఆగడాలకు అడ్డుపడేనా..?
సాక్షి, మర్రిపూడి (ప్రకాశం): ఎన్నికలకంటే మన భవిష్యత్‌ను నిర్దేశించేవి. మనల్ని పాలించే నేతలను ఎన్నుకునేవి. అంత ప్రాధాన్యం ఉన్న ఎన్నికల్లో టీడీపీ నేతల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ప్రలోభాలను పక్కనపెడితే కనీసం ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించుకోలేని విధంగా టీడీపీ నేతల ఆగడాలు ఉంటున్నాయి. ఇందుకు 2014లో జరిగిన ఎన్నికలే నిదర్శనం. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను బెదిరించడం వారిపై దౌర్జన్యానికి దిగడం టీడీపీ నేతలకు ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ నేతల దాడుల్లో ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు మండలంలోని 21 పంచాయతీల్లో 455 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. అయ్యవారిపాలెంలో మండలంలో అయ్యవారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదనే అక్కస్సుతో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పొడ్డారు. ఈ దాడుల్లో పలువురికి రక్త గాయాలైయ్యాయి. గత సంఘటనల నేపథ్యంలో అధికారులపై సమస్యాత్మక గ్రామాలపై, సమస్యాత్మక వ్యక్తులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జి.అగ్రహారంలో.. మండలంలోని గోసుకొండ అగ్రహారం గ్రామంలో 2014లో పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ బూతుల వద్ద ఇరువర్గీయులు మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ సానుభూతిపరులు చేసిన దాడుల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన తానికొండ శ్రీనివాసులు, రావులపల్లి ఏడుకొండలు, తేలుకుట్ల వెంకయ్యలకు గాయాలైయ్యాయి. టీడీపీ దాడిలో ఎంపీటీపీ భర్త వెంకయ్య మృతి మర్రిపూడి మండలం కెల్లంపల్లి పంచాయతీ జి. అగ్రహారంలో 2014 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కెల్లంపల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా తెలుకుట్ల గురవమ్మ (వైఎస్సార్ సీపీ) నుంచి పోటీ చేసింది. ఆ ఎన్నికల సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు తేలుకుట్ల గురవమ్మ భర్త వెంకయ్యపై దాడిచేశారు. ఈ దాడిలో గాయపడిన వెంకయ్య ఒంగోలు వైద్యశాలలో నెల రోజు పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందారు. తన భర్త వెంకయ్య తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పొట్టనపెట్టుకున్నారనే విషయం తెలుసుకుని దిగులుతో కెల్లంపల్లి ఎంపీటీసీ సభ్యురాలు తేలుకుట్ల గురవమ్మ ఒక సంవత్సరం తర్వాత ప్రాణాలు కోల్పోయింది. 2014లో విచ్చలవిడిగా దాడులు.. 2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. మండలంలోని జువ్విగుంట గ్రామంలోని కేజీకండ్రిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు గొడవ సృష్టించారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న తరుణంలో పోలింగ్ బూతులో ఉన్న ఏజెంట్ల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గీయుల మధ్య తోపులాట మొదలై ఘర్షణకు దారితీసింది. అనంతరం పథకం ప్రకారం టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో 10 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీస్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇరువర్గాలను కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. దీంతో పోలింగ్ తిరిగి సజావుగా సాగింది. అప్పటి జేసీ, కందుకూరు ఆర్డీఓ బాపిరెడ్డి పోలింగ్ కేంద్రానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ప్రశాంతంగా జరిగేలా చూడాలి గత ఎన్నికల్లో నా తండ్రి వెంకయ్య, తల్లి గురవమ్మను టీడీపీ నేతల దాడులతో కోల్పోయాను. ఈ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. మా గ్రామం లాంటి సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యే నిఘా పెట్టాలి. - తేలుకుట్ల వెంటేశ్వర్లు, కెల్లంపల్లి 455 మందిపై బైండోవర్ కేసులు పెట్టాం మండలంలోని అన్ని పంచాయతీల్లో సమస్మాత్మక గ్రామాలు, వ్యక్తులను గుర్తించి ఇప్పటి వరకు 455 మందిపై బైండోవర్ కేసులు పెట్టాం. 8 మంది రౌడీషీటర్లు పై కేసు నమోదు చేశాం. మరికొంత మందిపై బైండోవర్ కేసులు పెడుతున్నాం. ఈ నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపడుతున్నాం. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఉపేక్షించేది లేదు. ఎవరి ఓటు వారు భయపడకుండా ప్రశాంతమైన వాతావరణంలో వేసుకోవాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పోలీస్‌ల దృష్టికి తీసుకురావాలి. - కె.మాధవరావు, ఎస్సై -
పోలీసులా.. టీడీపీ ఏజెంట్లా..?
సాక్షి, చీరాల రూరల్ (ప్రకాశం): చీరాలలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీకి చెంఇన చిన్న పిల్లలు, ఆడవారిని పోలీసులు భయాందోళనకు గురిచేస్తున్నారు. పైపెచ్చు నాయకులను మీ ఇంట్లో ఓటర్ స్లిప్పులు, డబ్బులు దొరికాయంటూ పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి అననుకూలంగా వ్యవహరించనని చెప్పే వరకూ వారిని పోలీసుస్టేషన్లోనే ఉంచుతున్నారు. చీరాల, చీరాల రూరల్, వేటపాలెం పోలీసుస్టేషన్ల పరిధిలో పోలీసులు ముందగానే బైండోవర్లు నమోదు చేస్తున్నారు. గతంలో ఆయా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో గొడవలు పడిన వారిని, ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సంఘ పెద్దలుగా చెలామణి అవుతున్న వారిని, వార్డు కౌన్సిలర్లు, గతంలో కౌన్సిలర్లుగా పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లను ఎన్నికల ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు స్టేషన్లకు తరలించి సెక్షన్ 107 కింద తహసీల్దార్ల ఎదుట హాజరు పరచి బైండోవర్ చేసుకున్నారు. అంతేగాక ఆయా స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లుగా నమోదైన వారిని, సస్పెక్టు షీటులు ఉన్న వారిని, అనుమానితులును కూడా పోలీసుస్టేషన్లకు తరలించి బైండోవర్ చేశారు. కేసుల నమోదుకు టార్గెట్లా? చీరాల ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో 33 మున్సిపల్ వార్డులున్నాయి. వాటిలో సగం భాగం ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఉండగా మరో సగ భాగం వార్డులు టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్నాయి. పోలీసుస్టేషన్ల వారీగా తీసుకుంటే ప్రతి పోలీసుస్టేషన్లో ఒక్కో పోలీసు కానిస్టేబుల్‌కు ఆయా ప్రాంతానికి చెందిన కొంతమందిని టార్గెట్‌గా ఇచ్చి వారితో కచ్చితంగా బైండోవర్ చేయించారు. ఎవరైనా తాను సంఘ పెద్దను మాత్రమేనని, ఎలక్షన్‌తో తనకు సంబంధం లేదని గట్టిగా అడిగితే నీవు ఎలక్షన్లో ఓటు కూడా వేసే పనిలేదంటూ పోలీసులు బెదిరిపుంలకు దిగుతున్నారు. ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు సెక్షన్ 107 కింద 24 కేసులు నమోదు చేసి 270 మంది నేతలను బైండోవర్ చేశారు. సెక్షన్ 110 కింద 22 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. ఇక టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో సెక్షన్ 107 కింద 49 కేసులు నమోదు చేసి 344 మందిని బైండోవర్ చేశారు. 40 మందికిపైగా రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో సెక్షన్ 107 కింద 26 కేసులు నమోదు చేసి 473 మందిని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశారు. 23 మంది రౌడీషటర్లను కూడా బైండోవర్ చేసుకున్నారు. వేటపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో కూడా అంతే మొత్తంలో బైండోవర్లు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు పోలీసుల ఏకపక్ష వైఖరిపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల రాత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ గుంటూరు జిల్లాకు చెందిన జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వరదరాజులను నిచారణ అధికారిగా నియమించింది. రెండు రోజుల క్రితం ఆయన చీరాల చేరుకుని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో స్వయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమంచి టీడీపీ నాయకులు, పోలీసులు చేస్తున్న అరాచకాలను తెలిపే విధంగా పూర్తి సమాచారాన్ని డాక్యుమెంట్లు, సీడీల రూపంలో ఆయనకు అందించినట్లు సమాచారం. వైఎస్సార్ సీపీ నాయకులే టార్గెట్ బైండోవర్లు చేయడంలో కూడా పోలీసులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు చెప్పిన పేర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలో కొంచెం ఉత్సాహంగా పనిచేస్తున్న నేతలపైకి టీడీపీ నాయకులు పోలీసులను ఉసిగొల్పుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇళ్ల వద్ద నిద్రిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులను పోలీసులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పోలీసులు ఆయా ప్రాంతాలకు చెందిన నేతల ఇళ్ల వద్దకు చేరుకుని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల సమయం కాబట్టి సహజంగా ప్రతి వారి వద్ద ఓటర్ల జాబితా ఉంటుంది. ఓటర్ల జాబితా ఉన్న వారిని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నారు. వైఎస్సార్‌లో ఎక్కువగా పని చేస్తున్నావని, టీడీపీలో పనిచేస్తే మంచిదని పరోక్షంగా ఖాకీలు సలహా ఇస్తున్నారు. లేకుంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. చోటామోటా నేతలు చేసేదేమీ లేక నిస్సహాయ స్థితిలో ఎవరికి వారు భయపడుతున్నారు. పైపెచ్చు ఆయా నేతలతో తెల్లకాగితంపై సంతకాలు పెట్టించుకుని ఉదయాన్నే వదిలే స్తున్నారు. వారు బతుకు జీవుడా అంటూ ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. ఇటీవల 30వ వార్డుకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడిని పోలీసులు అర్ధరాత్రి సమయంలో స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో బెదిరింపులకు దిగారు. నీపై ఇప్పటికే కొన్ని కేసులున్నాయని, మరో రెండు కేసులు తగిలించి రౌడీషీటు కూడా తెరిచే ఆలోచన ఉందని, సక్రమంగా ఉంటే మంచిదంటూ హెచ్చరించి వదిలేశారు. 9వ వార్డుకు చెందిన మరో వైఎస్సార్ సీపీ నాయకుడిని కూడా పోలీసులు ఇదే తరహాలో అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి స్టేషన్‌కు తరలించారు. నీవు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నావని, ఇలాగే పనిచేస్తే కేసులు నమోదవుతాయని, జాగ్రత్తగా ఉంటే వదిలేస్తామని, లేకుంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని తీవ్ర బెదిరింపులకు దిగారు. తెల్ల కాగితంపై సంతకాలు తీసుకుని ఉదయాన్నే వదిలేశారు. ఇలా ప్రతి వార్డులో ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులను పోలీసులు టార్గెట్ చేసి పోలీసుస్టేషన్లకు తరలించి తమదైన శైలిలో బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యే నాటికి ఇంకా ఎంతమంది వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు స్టేషన్లకు తరలించి వేధింపులకు గురిచేస్తారోనని నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. -
'మందకృష్ణ రథయాత్రను అడ్డుకునేందుకు కుట్ర'
ప్రకాశం: ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ చేపట్టనున్న రథయాత్రను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కుట్ర పన్నుతోందని ఎమ్మార్పీఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ ఆరోపించారు. సోమవారం ఆయన ప్రకాశం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అన్ని జిల్లాల్లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను నిర్బంధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖూనీ చేస్తున్నారని బ్రహ్మయ్య మాదిగ విమర్శించారు. -
3 వేల మందిపై బైండోవర్ కేసులు
రేగిడి,న్యూస్‌లైన్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉం డేందుకు ముందస్తుగా పాల కొండ డివిజన్లో మూడువేల మందిపై బైండోవర్ కేసులు పెట్టామని డీఎస్పీ దేవానంద్‌శాంతో వెల్లడించారు. బుధవారం రేగిడి వచ్చిన ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి డబ్బు, మద్యం అక్రమంగా తరలించకుండా ఉండేందుకు డివిజన్లో పది చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఇవి 24 గంటలూ పని చేస్తాయని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న సుమారు 8 లక్షల రుపాయలను ఇప్పటి వరకూ పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజాం, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో 170 సమస్యాత్మక గ్రామాలను గుర్తించామన్నారు. ఈ గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా సిబ్బందిని ఏర్పాటు చేస్తామని వివరించారు. అనంతరం బూరాడ, పారంపేట గ్రామాల్లో డీఎస్పీ పర్యటించి ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని ప్రజలను కోరారు. ఆయన వెంట హెడ్‌కానిస్టేబుళ్లు రిప్పన్ రావు, సురేష్ కుమార్ ఉన్నారు.