
తిరుపతి : మట్టిపనులతో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ప్రాజెక్టుల్లో ఆ పార్టీ నేతలు భారీ అక్రమాలకు పాల్పడ్డారని, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆప్కో బట్టల కొనుగోళ్లలో వందల కోట్లు దండుకున్నారని విమర్శించారు. ఆదివారం తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ప్రజా ధన్యవాద సభలో ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం, హంద్రీనీవా వంటి సాగునీటి ప్రాజెక్టులు చేపడితే చంద్రబాదు రాజధాని పేరుతో కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు.
కుప్పం నియోజకవర్గంలో మరుగుదొడ్డ నిధులను టీడీపీ కార్యకర్తలు తమ ఖాతాలో వేసుకున్నారని మండిపడ్డారు. అధికారం తమదేనని చంద్రబాబు పగటికలు కని ఇప్పుడు ఇంట్లో నిద్రపట్టని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. సాయం చేసేవారిని వెన్నుపోటు పొడిచే వ్యక్తిత్వం చంద్రబాబు సొంతమని అన్నారు. రాష్ట్రంలో రూ 76వేల కోట్ల ఎస్‌ఆర్‌ఈజీఎస్ పనులు కేంద్రం నుంచి వస్తే టీడీపీ నేతలు నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment