అమరావతి పేరుతో ఎందుకీ హడావుడి: బీజేపీ | bjp senior leader takes a jibe on tdp over ap capital construction | Sakshi
Sakshi News home page

అమరావతి పేరుతో ఎందుకీ హడావుడి: బీజేపీ

Published Sat, Mar 25 2017 3:28 PM | Last Updated on Fri, Mar 29 2019 6:00 PM

అమరావతి పేరుతో ఎందుకీ హడావుడి: బీజేపీ - Sakshi

అమరావతి పేరుతో ఎందుకీ హడావుడి: బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో ఎందుకింత హడావుడి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొత్తగా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అవన్నీ ఇంత హంగామా చేశాయా అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌ను ఆ రాష్ట్ర హౌసింగ్ బోర్డే కట్టిందని, ఇక్కడి ప్రభుత్వం మాత్రం సింగపూర్, జపాన్ అంటూ హడావుడి చేస్తోందని ఆయన విమర్శించారు.

టీడీపీ వల్లే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ గెలిస్తే.. మరి మిగిలిన చోట్ల టీడీపీ ఎందుకు ఓడిపోయిందని సోము వీర్రాజు సూటిగా ప్రశ్నించారు. అధికార పార్టీకి తమ బీజేపీ ఇప్పుడు కొత్తిమీర కట్టలా కనిపిస్తోందన్నారు. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తమను కనీసం సంప్రదించకుండా వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement