కరీంనగర్ క్రైం: కరీంనగర్ టవర్‌సర్కిల్‌లో బంగారు దుకాణం నిర్వహిస్తున్న ఓ వ్యాపారి కూతురు ఇంజనీరింగ్ చదువుతోంది. ఈ అమ్మాయిని ఓ వర్గం ముఠా ప్రేమ పేరుతో ట్రాఫ్ చేసింది. నగర శివారుకు తీసుకుని వెళ్లి మత్తుమందు కలిపి తాగించి,అసభ్యకరంగా వీడియో రికార్డ్ చేసింది.
ఈ విషయం బయటకు చెబితే వీటిని సామాజిక వైబ్‌సైట్లలో పెడుతామని బెదిరించి ఆమె నుంచి డబ్బులు, సెల్‌ఫోన్లు లాంటివి తీసుకుంటున్నారని తెలిసింది.భగత్‌నగర్‌కు చెందిన ఓ వివాహిత భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న మహిళపై సదరు ముఠా కన్నుపడింది. పరిచయం పెంచుకుని ఒంటరిగా ఉన్న సమయంలో అమెను కూడా ఇలాగే వీడియో రికార్డు చేసి బేదిరింపుకుల గురిచేస్తున్నట్టు సమాచారం. రాంనగర్‌కు చెందిన ఓ తొమ్మిదో తరగతి చదవుతున్న బాలికను ఇదేవిధంగా ట్రాప్ చేశారని తెలిసింది.
ఇలా కంటికి కనిపించిన వారిని ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం, అనంతరం వారిని అసభ్యకరంగా చిత్రించడం, లైంగికంగా, అర్థికంగా వేధింపులకు గురిచేయడం సదరు ముఠాకు నిత్యకృత్యంగా మారింది. అయితే సదరు బాధితులు బయటకు రావాడానికి కానీ, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కానీ జంకుతున్నారు.
తాజాగా ఇలాంటిదే మరో రకమైన సంఘటన వెలుగుచూసింది. ధర్మారం మండలం పత్తిపాక గ్రామానికి చెందిన బూర మధుకర్(19) కరీంనగర్‌లోని గోదాంగడ్డలో నివాసం ఉంటూ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదవుతున్నాడు. ఈనెల 8వ తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎస్‌బీఎస్ ఫంక్షన్‌హాల్‌లో ఎదురు సందుకు రాగానే గుర్తుతెలియిన కొంతమంది వ్యక్తులు వచ్చి తమ వర్గం అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ ఓ జెన్ కారులో తీసుకుని వెళ్లారు. అక్కడినుంచి కశ్మీర్‌గడ్డలోని ఐబీఎన్ గెస్ట్‌హౌస్‌లో తీవ్రంగా చితకబాదారు. అక్కడినుంచి నగరంలోని పలు ప్రాంతాలు తిప్పుతూ కొడుతూ మరోసారి తమ వర్గం అమ్మాయితో మాట్లాడితే చంపుతామని హెచ్చరించారు.
గోదాంగడ్డ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి మరోసారి చితకబాది మధుకర్ వద్ద ఉన్న సెల్‌ఫోన్, రూ.500, ఏటీఎం తీసుకున్నారు. ఏటీఎం పిన్ నంబర్ కోసం మళ్లీ చితకబాదారు. పిన్ నంబర్ చెప్పడంతో వారు పోలీస్ హెడ్‌క్వార్టర్ పక్కనే ఉన్న అంధ్రాబ్యాంక్ ఏటీఎం నుంచి రూ.3000 డ్రా చేసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా పలుచోట్ల మధుకర్‌ను చితకబాది తెల్లపేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు.
ఇప్పటికే నీలాంటి వాళ్లను ఎంతో మందిని చితకబాదామని, మరోసారి తమ వర్గం అమ్మాయితో మాట్లాడితే చంపుతామని బెదిరించి వెళ్లిపోయారని మధుకర్ ఈనెల 10వ తేదీన కరీంనగర్ టుటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన పోలీసులు 423/2014లో కేసు నమోదు చేశారు. దీనిపై ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు టుటౌన్ సీఐ హరిప్రసాద్ తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి మరి కొంతమంది బాధితులుగా మారకముందే ఈ ప్రమాదకమైన ముఠాలను కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.
అటు విచారణ.. ఇటు భారీ నజరానా!
Published Sun, Dec 14 2014 3:01 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement