చెరకుపల్లి: గుంటూరు జిల్లాలో పాము కాటుకు గురై శుక్రవారం ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చెరకుపల్లికు చెందిన పిట్టు రోహిత్ (2)ను ఇంటి సమీపంలో ఓ కట్లపాము కాటేసింది.
వెంటనే కుటుంబ సభ్యులు దగ్గరలోని కావూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో రోహిత్ను అక్కడి నుంచి కనగాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఇంజెక్షన్లు లేవని వైద్య సిబ్బంది పంపించి వేశారు. దీంతో వైద్య సాయం అందక రోహిత్ మృతి చెందాడు. తల్లిదండ్రులకు రోహిత్ ఒక్కడే సంతానం కావడంతో చిన్నారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.