35 ఏళ్లకు ఒక్కటైన అన్నదమ్ములు
* తండ్రి మరణించినా దూరం
* బిడ్డల పెళ్లిళ్లకూ మాటలు కలవలేదు
* వైఎస్సార్ సీపీ కోసం కలిసిన సోదరులు
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కాయలవాండ్లపల్లెకు చెందిన సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు పప్పు రాజారెడ్డి, బి.కొత్తకోట సహకార గృహనిర్మాణ సంఘం అధ్యక్షుడు పప్పు రవీంద్రనాథ్‌రెడ్డి అన్నదమ్ములు. వీరిద్దరూ బి.కొత్తకోటలో స్థిరపడ్డారు. వీరికి 19, 18 ఏళ్ల వయసులోనే మనస్పర్థలు రావడంతో విడిపోయూరు. అప్పటి నుంచి మాటలు లేవు. విడిపోయూక తొలుత అన్న రాజారెడ్డి వివాహం జరిగింది. తర్వాత రవీంద్రనాథ్‌రెడ్డి పెళ్లి జరిగింది. ఒకరి వివాహాలకు ఒకరు హాజరుకాలేదు. కొంత కాలానికి తండ్రి లక్ష్మీనారాయణరెడ్డి మరణించారు. కర్మక్రియలను సోదరులిద్దరూ వేర్వేరుగా జరిపారు.
గడచిన మూడేళ్లలో రాజారెడ్డి కుమార్తె, రవీంద్రనాథ్‌రెడ్డి కుమార్తె వివాహలు జరిగారుు. ఈ పెళ్లిళ్ల సమయంలోనూ సోదరులు కలవలేదు. మనవళ్లు పుట్టినా మాటలు కలవలేదు. ఈ పరిస్థితుల్లో కొన్ని రోజులుగా సోదరుల మధ్యన మాటలు కలిశాయి. ఎదురుపడితే పలకరించుకుంటున్నారు. యోగక్షేమాలు చెప్పుకుంటున్నారు. చూసేవాళ్లు ఇది నిజమేనా అని అనుమానిస్తున్నారు. దీని వెనుక జరిగిందేమిటంటే..రవీంద్రనాథ్‌రెడ్డి తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యేప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గీయుడు. ప్రవీణ్ టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడంతో ఈయన కూడా పార్టీలోకి వచ్చేశారు. ఆయన సోదరుడు రాజారెడ్డి మొదటి నుంచి వైఎస్సార్‌సీపీలోనే ఉన్నారు.
మొదట్లో ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి దూరంగా ఉన్న రాజిరెడ్డి ఇటీవల దగ్గరయ్యారు. పార్టీ సమావేశాలప్పుడు అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు ఎదురుపడడం లాంటి సందర్భాల్లో ఓ శుభవేళ మాటలూ కలిశాయి. అంతే ఇద్దరూ అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు. పాత మనస్పర్థలు మరచి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. సోదరులిద్దరూ కలిసి పార్టీ సమావేశాలకు హాజరవుతున్నారు.